పెరిగిన బంగారం.. తగ్గిన వెండి ధరలు..
ABN , Publish Date - May 21 , 2026 | 07:34 AM
ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న వివిధ పరిణామాల నేపథ్యంలో బంగారం, వెండి ధరలు రోజురోజుకు మారిపోతున్నాయి. వీటి ధరలు ఒక రోజు తగ్గితే.. మరో రోజు పెరుగుతున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న వివిధ పరిణామాల నేపథ్యంలో బంగారం, వెండి ధరలు రోజురోజుకు మారిపోతున్నాయి. పసిడి ధరలు ఒక రోజు తగ్గితే.. మరో రోజు పెరుగుతున్నాయి. ధరల్లో స్థిరత్వం లేకుండా కొనసాగుతున్నాయి. ఈ రోజు (గురువారం, మే 21) ఉదయం హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,58,360గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,45,160గా ఉంది. కిలో వెండి ధర రూ. 2,84,900గా ఉంది (Gold, Silver Rates in Hyderabad on May 21).
బుధవారం (నిన్న) వీటి ధరలు.. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,57,050గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,43,960గా ఉంది. కిలో వెండి ధర రూ.2,99,900గా ఉంది. దీంతో నిన్నటి బంగారం ధరలతో పోలిస్తే.. ఈ రోజు పెరిగాయనే చెప్పాలి. అలాగే వెండి ధర మాత్రం తగ్గినట్లు స్పష్టమవుతుంది.
దేశ రాజధాని న్యూఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,58,510గా ఉంది. 22 క్యారెట్ల పసిడి ధర రూ.1,45,310 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.2,79,900గా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,58,360గా ఉంది. 22 క్యారెట్ల పసిడి ధర రూ.1,45,160గా ఉంది. కిలో వెండి ధర రూ.2,79,900గా ఉంది. చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,60,900గా ఉంది. 22 క్యారెట్ల పసిడి ధర రూ.1,47,490గా ఉంది. కిలో వెండి ధర రూ.2,84,900గా ఉంది.
గమనిక: బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. ఈ నేపథ్యంలో కొనుగోలు చేసే ముందు ఒకసారి వీటి ధరలు పరిశీలించుకోవాలని సూచన.
ఈ వార్తలు కూడా చదవండి..
ప్రారంభమైన సరస్వతి నది అంత్య పుష్కరాలు..
For More Business News And Telugu News