Share News

హైబ్రిడ్ విధానంలో మహానాడును సక్సెస్‌ చేయాలి: సీఎం చంద్రబాబు

ABN , Publish Date - May 21 , 2026 | 03:01 PM

టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన తెలుగుదేశం పొలిట్‌బ్యూరో సమావేశం ముగిసింది. మహానాడు నిర్వహణ ప్రధాన అజెండాగా సమావేశంలో చర్చ జరిగింది.

హైబ్రిడ్ విధానంలో మహానాడును సక్సెస్‌ చేయాలి: సీఎం చంద్రబాబు
CM Chandrababu

అమరావతి, మే 21: టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన తెలుగుదేశం పొలిట్‌బ్యూరో సమావేశం ముగిసింది. మహానాడు నిర్వహణ ప్రధాన అజెండాగా సమావేశంలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. కార్యకర్తే అధినేత అనేది మహానాడులో వినిపించాలన్నారు. మహిళలకు తెలుగుదేశం ఇస్తున్న ప్రాధాన్యం మహానాడు వేదికగా అందరికీ అర్థమయ్యేలా చాటాలని సూచించారు. సంప్రదాయ ఓటును జాగ్రత్తగా కాపాడుకోవాలన్నారు. జనాభాలో 50 శాతం ఉన్న బీసీలు పార్టీ ఆవిర్భావం నుంచి వెన్నుదన్నుగా ఉన్నారని చెప్పారు. బీసీల అభివృద్ధికి పార్టీ కట్టుబడి ఉందనే సందేశం స్పష్టంగా వెళ్లాలని నేతలకు తెలిపారు.


హైబ్రిడ్ విధానంలో నిర్వహించే మహానాడును విజయవంతం చేయాలని టీడీపీ అధినేత పిలుపునిచ్చారు. రోజూ ఉదయం 9 గంటల నుంచే 2 రోజుల మహానాడు ప్రారంభిద్దామని అన్నారు. మండల స్థాయిలో నిర్వహిద్దామనే ప్రతిపాదనపైనా సమావేశంలో చర్చ జరగగా.. క్లస్టర్ స్థాయిలోనే నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. మహానాడులో ప్రవేశపెట్టే 19 తీర్మానాలకు పొలిట్‌బ్యూరో ఆమోదం తెలిపిందన్నారు. సమయపాలన పాటించాలని.. ప్రతి వక్తా తమకు కేటయించిన అంశంలో నిష్ణాతుడై సమయపాలన పాటిస్తూ విషయం సూటిగా చెప్పాలని ఆదేశించారు. మహానాడులో ప్రవేశపెట్టే తీర్మానాలపై సీఎం చంద్రబాబు పలు సూచనలు చేశారు.


ఇవి కూడా చదవండి...

దళిత డ్రైవర్ హత్య కేసు.. రాజమండ్రి కోర్టులో రెండో రోజు విచారణ

కిరీటం మాయంపై విచారణ.. అందుబాటులోని లేని ట్రస్ట్‌ సభ్యులు.. ఏసీ ఆగ్రహం

Read Latest AP News And Telugu News

Updated Date - May 21 , 2026 | 03:10 PM