Share News

దళిత డ్రైవర్ హత్య కేసు.. రాజమండ్రి కోర్టులో రెండో రోజు విచారణ

ABN , Publish Date - May 21 , 2026 | 11:33 AM

దళిత డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో రాజమండ్రి ప్రత్యేక కోర్టులో రెండో రోజు విచారణ కొనసాగుతోంది. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు ఈరోజు కోర్టుకు హాజరయ్యారు.

దళిత డ్రైవర్ హత్య కేసు.. రాజమండ్రి కోర్టులో రెండో రోజు విచారణ
Rajahmundry Court

రాజమండ్రి, మే 21: దళిత డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో రాజమండ్రి ప్రత్యేక కోర్టులో రెండో రోజు విచారణ కొనసాగుతోంది. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు ఈరోజు(గురువారం) కోర్టుకు హాజరయ్యారు. వైసీపీ ఎమ్మెల్సీ కేసులో నిన్నటి(బుధవారం) నుంచి సాక్షుల విచారణ జరుగుతోంది. నిన్న డ్రైవర్ సుబ్రహ్మణ్యం తల్లి నూకరత్నం కోర్టుకు హాజరయ్యారు. ఈరోజు సుబ్రహ్మణ్యం తండ్రి, సోదరులను న్యాయమూర్తి విచారించనున్నారు. సాక్షుల విచారణ మే 26 వరకు కొనసాగనుంది.


నిన్నటి(మే 20) విచారణ తర్వాత స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ముప్పాళ్ల సుబ్బారావు డీహైడ్రేషన్తో అస్వస్థతకు గురయ్యారు. ఈరోజు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన సుబ్బారావు.. కోర్టుకు హాజరయ్యారు. ఈ కేసు ప్రస్తుతం రాజమండ్రి ప్రత్యేక కోర్టులో విచారణ కొనసాగుతోంది. సాక్షుల విచారణ పూర్తి అయిన అనంతరం తదుపరి విచారణ ఎలా ఉండబోతుందనే ఆసక్తి నెలకొంది.


ఇవి కూడా చదవండి...

నిప్పుల కొలిమి..

గుంటూరులో అగ్నిప్రమాదం.. డ్రైనేజీ పైపుల దగ్ధం

Read Latest AP News And Telugu News

Updated Date - May 21 , 2026 | 11:48 AM