Share News

పులివెందుల ఘర్షణలకు ఎంపీ అవినాష్ రెడ్డే కారణం: టీడీపీ నేత బీటెక్ రవి

ABN , Publish Date - Oct 17 , 2026 | 09:49 PM

ఆంధ్రప్రదేశ్‌లో స్థానికసంస్థల ఎన్నికలకు సంబంధించి నామినేషన్ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో పులివెందులలో జరిగిన అల్లర్లను టీడీపీ నేత బీటెక్ రవి ఖండించారు. వైసీపీ నేతలు ఉద్దేశపూర్వకంగానే గొడవలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు.

పులివెందుల ఘర్షణలకు ఎంపీ అవినాష్ రెడ్డే కారణం: టీడీపీ నేత బీటెక్ రవి
mp avinash reddy on pulivendula issue

కడప, అక్టోబర్ 17: ఉమ్మడి కడప జిల్లాలోని పులివెందులలో కొనసాగుతున్న స్థానికసంస్థల ఎన్నికల నామినేషన్‌ నేపథ్యంలో వైసీపీ నేతలు గొడవలు సృష్టించడాన్ని టీడీపీ నేత బీటెక్ రవి తీవ్రంగా ఆక్షేపించారు. టీడీపీ నేతలు పులివెందులలో నామినేషన్స్ వేయడం ఓర్వలేకనే వైసీపీ నేతలు
దాడులకు పాల్పడ్డారని ఆరోపించారు.


ఎంపీ అవినాష్ కావాలనే గొడవలు సృష్టిస్తున్నారు: టీడీపీ నేత బీటెక్ రవి

‘ఎంపీ ఉద్దేశపూర్వకంగానే పులివెందులలో గొడవలు సృష్టిస్తున్నారు. పులివెందులలో కూటమి అభ్యర్థులు నామినేషన్లు వేస్తుంటే.. వైఎస్ కుటుంబసభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే ఇలా హింసను ప్రోత్సహిస్తు్న్నారు.144 సెక్షన్‌ అమల్లో ఉన్నా.. నిబంధనలు అతిక్రమించి.. అవినాష్‌రెడ్డి ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. పోలీసులపై వైసీపీ శ్రేణులు రాళ్ల దాడి చేయడం వల్లే.. వారు కాల్పులు జరపాల్సి వచ్చింది’ అని బీటెక్ రవి పేర్కొ్న్నారు. కాగా.. పులివెందుల నామినేషన్ కేంద్రం వద్ద టీడీపీ, వైసీపీ శ్రేణులకు మధ్య ఘర్షణ జరిగిన విషయం తెలిసిందే. పోలీసులపైకి వైసీపీ నేతలు రాళ్లు రువ్వడంతో వారు గాల్లోకి 6 రౌండ్ల కాల్పులు జరిపి ఉద్రిక్త పరిస్థితులను అదుపులోకి తెచ్చారు.


ఈ వార్తలనూ చదవండి:

డబ్లిన్‌లో ఎన్నారైల ఆత్మీయ సమ్మేళనం.. పాల్గొన్న శ్రీనివాస్ మిరియాల

శంకర నేత్రాలయ ఆర్కాన్సాస్ విభాగం ఆధ్వర్యంలో ‘మ్యూజిక్ అండ్ డ్యాన్స్ ఫర్ విజన్’

Updated Date - Oct 17 , 2026 | 10:02 PM