వైసీపీ పాలనలో 20 లక్షల జాబ్ కార్డుల తొలగింపు.. జగన్‌పై కోటంరెడ్డి ఫైర్
ABN , Publish Date - Nov 24 , 2026 | 06:10 PM
గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ఉపాధిహామీని నిర్లక్ష్యం చేసి.. అవినీతికి అడ్డాగా మార్చుకున్నారంటూ ఆ పార్టీ నేతలపై నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మండిపడ్డారు. నేడు వైసీపీ అనుకూల మీడియా సాక్షి పేపర్లో కపట ప్రేమ చూపిస్తూ వార్తలు… విడ్డూరం కాదూ? అంటూ వ్యంగ్యంగా అన్నారు.
అమరావతి, నవంబర్ 24: గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ఉపాధిహామీని నిర్లక్ష్యం చేసి.. అవినీతికి అడ్డాగా మార్చుకున్నారంటూ ఆ పార్టీ నేతలపై నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మండిపడ్డారు. నేడు వైసీపీ అనుకూల మీడియా సాక్షి పేపర్లో కపట ప్రేమ చూపిస్తూ వార్తలు… విడ్డూరం కాదూ? అంటూ వ్యంగ్యంగా అన్నారు. మంగళవారం రాజధాని అమరావతిలో ఆయన మాట్లాడుతూ.. గత ఐదేళ్ల జగన్ పాలనలో రూ.500 కోట్లు ఉపాధి కూలీలకు బకాయిలు పెట్టారని గుర్తు చేశారు. గత ఐదేళ్ల పాలనలో 20 లక్షల జాబ్ కార్డులు తోలగించడం ద్వారా పేదల పొట్టకొట్టారని విమర్శించారు. జాతీయ స్థాయిలో జాబ్‌కార్డుల తొలగింపు 11 శాతం ఉంటే.. ఏపీలో 24.6 శాతం తొలగించారని వివరించారు.
నేడు ఉపాధి హామీపై మాట్లాడే నైతిక హక్కు ఉందా? అంటూ ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌ను ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. రాష్ట్రవ్యాప్తంగా ఐదేళ్లలో కూలీలు రూ.5 వేల కోట్ల వేతనాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ పాలనలో నరేగా నిధుల దుర్వినియోగంలో ఏపీ మొదటి స్థానంలో ఉందని గుర్తు చేశారు. వైసీపీ పాలనలో దొంగ మస్టర్ల ద్వారా రూ.1,300 కోట్లు స్వాహా చేశారని చెప్పారు. నేడు ఉపాధి కూలీల సంక్షేమంపై మొసలి కన్నీరు కారుస్తున్నారంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్‌పై ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నిప్పులు చెరిగారు.
ఈ వార్తలు కూడా చదవండి..
స్విమ్మింగ్ పూల్‌లో గిలగిల తన్నుకుంటున్న చిన్నారి.. ఇంతలో ఏం జరిగిందంటే.. వీడియో వైరల్
ఇలా వచ్చి.. అలా సెల్ ఫోన్ కొట్టేసింది.. ఆ తర్వాత ఏం చేసిందంటే.. వీడియో వైరల్