Share News

ఇలా వచ్చి.. అలా సెల్ ఫోన్ కొట్టేసింది.. ఆ తర్వాత ఏం చేసిందంటే.. వీడియో వైరల్

ABN , Publish Date - Nov 24 , 2026 | 02:52 PM

రైల్వేస్టేషన్‌.. బస్టాండ్‌లలో.. దొంగలు ఉంటారని అప్రమత్తంగా ఉండాలని ప్రయాణికులకు మైక్‌లో నిత్యం పోలీసులు హెచ్చరిస్తూ ఉంటారు. దీంతో ప్రయాణికులు జాగ్రత్తలు తీసుకుంటారు. వారు ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా.. దొంగలు మాత్రం తమ చేతి వాటాన్ని ప్రదర్శిస్తారు.

ఇలా వచ్చి.. అలా సెల్ ఫోన్ కొట్టేసింది.. ఆ తర్వాత ఏం చేసిందంటే.. వీడియో వైరల్

ఇంటర్నెట్ డెస్క్: రైల్వేస్టేషన్‌.. బస్టాండ్‌లలో.. దొంగలు ఉంటారని అప్రమత్తంగా ఉండాలని ప్రయాణికులకు మైక్‌లో నిత్యం పోలీసులు హెచ్చరిస్తూ ఉంటారు. దీంతో ప్రయాణికులు జాగ్రత్తలు తీసుకుంటారు. వారు ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా.. దొంగలు మాత్రం తమ చేతి వాటాన్ని ప్రదర్శిస్తారు. అలాంటి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో.. రైల్వే స్టేషన్‌లో ఫ్లాట్‌ఫామ్‌పై రైలు నిలిచి ఉంది. ప్రయాణికులు రైలు ఎక్కుతున్నారు. బోగికి పక్కగా ఓ వ్యక్తి నిలబడి ఉన్నాడు. అతడి వెనుక ఓ మహిళ భుజానికి బ్యాగ్ తగిలించుకుని ఉంది. అందులో బ్యాగ్ సైడ్ పాకేట్‌లో సెల్ ఫోన్ పెట్టింది. ఇంతలో మరో మహిళ అక్కడికి వచ్చి.. ఆ బ్యాగ్‌లోని సెల్ ఫోన్ తీసుకుని రైలు ఎక్కేసింది.


సెల్ ఫోన్ దొంగలించిన మహిళ ఏ మాత్రం కంగారు పడకుండా.. చాలా కూల్‌గా రైలు ఎక్కేసింది. మీ సెల్ ఫోన్ చోరీ చేశారంటూ సదరు మహిళకు ఆ వెనుక ఉన్న యువతి తెలిపింది. దీంతో బాధితురాలు తీవ్ర గందరగోళానికి గురైంది. తన బ్యాగు జిప్ తీసి మొత్తం చెక్ చేసుకుంది. కానీ సెల్ ఫోన్ కనిపించలేదు. ఈ వీడియోను @Bilalansari1995 అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీలో షేర్ చేశారు. ఈ వీడియో వైరల్ అవుతోంది. దీనిని ఇప్పటి వరకు 5 వేల మందికిపైగా నెటిజన్లు వీక్షించి.. లైక్‌ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు విభిన్న రీతిలో స్పందిస్తున్నారు. దొంగతనం చేసే పద్దతి కాస్తా భిన్నంగా ఉందంటూ పేర్కొన్నారు. ఏ మాత్రం అజాగ్రత్తతో ఉన్నా.. మన వస్తువులు చోరీ చేస్తారంటూ మరొకరు అన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పెళ్లిలో కోటి రూపాయల నగదు దండలు.. వరులకు బావ భారీ కానుక

ఏనుగు విగ్రహం సందులో ఇరుక్కున్న భక్తుడు.. చివరకు ఏమైందంటే!

Updated Date - Nov 24 , 2026 | 03:10 PM