Share News

పెళ్లిలో కోటి రూపాయల నగదు దండలు.. వరులకు బావ భారీ కానుక

ABN , Publish Date - Nov 24 , 2026 | 11:45 AM

పెళ్లంటేనే సందడి.. ఆ పెళ్లిలో బహుమతులు మరింత ప్రత్యేకం. కానీ ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఓ వివాహ వేడుకలో బావగారు ఇచ్చిన కానుక అందరినీ ఆశ్చర్యపరిచింది.

పెళ్లిలో కోటి రూపాయల నగదు దండలు.. వరులకు బావ భారీ కానుక
Mathura Wedding

ఇంటర్నెట్ డెస్క్: ఉత్తరప్రదేశ్‌లోని మధురలో జరిగిన ఓ వివాహ వేడుకలో భారీ నగదు దండలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇద్దరు వరులకు వారి బావగారు ఒక్కొక్కరికి కోటి రూపాయల విలువైన కరెన్సీ నోట్లతో తయారు చేసిన భారీ దండలను బహుమతిగా అందించారు. రాజస్థాన్‌కు చెందిన సర్పంచ్ అయిన బావ ఈ ఖరీదైన కానుకను ఏర్పాటు చేశారు. నాగ్లా ఫోండా గ్రామంలో జరిగిన ఈ వేడుకలో వరులు ప్రశాంత్, కన్హా రాఘవ్‌లకు ఈ ప్రత్యేక బహుమతిని అందజేశారు. పూర్తిగా రూ.500 నోట్లతో తయారు చేసిన ఒక్కో దండ సుమారు 100 అడుగుల పొడవు ఉండటం విశేషం.


దండల భారీ పరిమాణం కారణంగా వాటిని పట్టుకోవడానికి, వరుల మెడలో వేయడానికి పలువురు అవసరమయ్యారు. ఈ సందర్భంగా ఇద్దరు వరులను ఇంటి పైకప్పుపై నిలబెట్టి భారీ నగదు దండలను అలంకరించారు. ఈ వినూత్న బహుమతిని చూసి బంధువులు, గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. ఈ అరుదైన వేడుకను పలువురు తమ మొబైల్ ఫోన్లలో చిత్రీకరించగా, అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పెళ్లి వేడుకలో కోటి రూపాయల నగదు దండల ప్రదర్శన ఇప్పుడు నెట్టింట చర్చనీయాంశంగా మారింది.


ఈ వార్తలు కూడా చదవండి:

కరీంనగర్‌ వైద్య కాలేజీ నిర్మాణంలో జాప్యమేంటి?

నిమ్స్‌లో అడుగడుగునా అవినీతి

Read Latest AP News And Telangana News

Updated Date - Nov 24 , 2026 | 12:01 PM