ఏనుగు విగ్రహం సందులో ఇరుక్కున్న భక్తుడు.. చివరకు ఏమైందంటే!
ABN , Publish Date - Nov 24 , 2026 | 07:56 AM
మధ్యప్రదేశ్‌లోని అమర్‌కంటక్‌లో ఉన్న నర్మదా ఆలయంలో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. కోరికలు నెరవేరుతాయనే నమ్మకంతో ఏనుగు విగ్రహం కాళ్ల మధ్య నుంచి వెళ్లేందుకు ప్రయత్నించిన ఓ భక్తుడు మధ్యలోనే ఇరుక్కుపోయాడు.
ఇంటర్నెట్ డెస్క్: మధ్యప్రదేశ్‌లోని అమర్‌కంటక్‌లో ఉన్న నర్మదా ఆలయంలో ఓ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. ఆలయంలో సంప్రదాయ ఆచారంలో భాగంగా ఏనుగు విగ్రహం కాళ్ల మధ్య ఉన్న ఇరుకైన సందు గుండా వెళ్లేందుకు ప్రయత్నించిన ఓ భక్తుడు మధ్యలోనే ఇరుక్కుపోయాడు. స్థానిక నమ్మకం ప్రకారం.. ఆ సందు గుండా ఎలాంటి ఇబ్బంది లేకుండా వెళ్లిన వారి కోరికలు నెరవేరుతాయని భక్తులు విశ్వసిస్తారు. కొందరు దీనిని వ్యక్తి మంచి చెడులను పరీక్షించే ఆచారంగా కూడా భావిస్తారు. అయితే, ఈ ఆచారాన్ని పాటించే క్రమంలో ఆ భక్తుడు ఇబ్బందుల్లో చిక్కుకున్నాడు.
భక్తుల సహాయంతో బయటపడిన వ్యక్తి..
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోమవారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందులో ఏనుగు విగ్రహం కింద ఇరుక్కుపోయిన వ్యక్తిని బయటకు తీసేందుకు పలువురు భక్తులు ప్రయత్నించడం కనిపించింది. కొందరు మతపరమైన నినాదాలు చేస్తుండగా.. మరికొందరు అతడిని బయటకు లాగేందుకు శ్రమించారు. చివరకు అందరూ కలిసి అతడిని సురక్షితంగా బయటకు తీశారు. అయితే.. ఈ ఘటన ఎప్పుడు జరిగిందనే దానిపై స్పష్టత లేదు. మ ఈ వీడియోపై సోషల్ మీడియాలో నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ‘భక్తితో ఏదైనా సాధ్యం అని నిరూపించాడు’ అని ఒక నెటిజన్ కామెంట్ చేయగా, ‘హమ్మయ్య.. కొద్దిసేపు టెన్షన్ పడిపోయాం’ అని మరో నెటిజన్ కామెంట్ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి:
కరీంనగర్ వైద్య కాలేజీ నిర్మాణంలో జాప్యమేంటి?
Read Latest AP News And Telangana News