Share News

స్విమ్మింగ్ పూల్‌లో గిలగిల తన్నుకుంటున్న చిన్నారి.. ఇంతలో ఏం జరిగిందంటే.. వీడియో వైరల్

ABN , Publish Date - Nov 24 , 2026 | 04:07 PM

కుక్క.. విశ్వాసానికి ప్రతీక. ఆ జీవికి ఒక్కసారి అన్నం పెడితే.. విశ్వాసాన్ని చూపిస్తుంది. చాలా మంది ఇళ్లలో కుక్కలను పెంచుకుంటారు.

స్విమ్మింగ్ పూల్‌లో గిలగిల తన్నుకుంటున్న చిన్నారి.. ఇంతలో ఏం జరిగిందంటే.. వీడియో వైరల్

ఇంటర్నెట్ డెస్క్: కుక్క.. విశ్వాసానికి ప్రతీక. ఆ జీవికి ఒక్కసారి అన్నం పెడితే.. విశ్వాసాన్ని చూపిస్తుంది. చాలా మంది ఇళ్లలో కుక్కలను పెంచుకుంటారు. ఇంటికి అపరిచితులు ఎవరైనా వస్తే.. ముందే పసిగట్టి గట్టిగా అరుస్తాయి. వీటికి విశ్వాసమే కాదు.. ధైర్యం, సమయస్ఫూర్తి కూడా ఎక్కువే. ఒక్కో సారి ప్రాణాలకు తెగించి మరి మనుషులను రక్షిస్తాయి. అలాంటి ఓ వీడియో వైరల్ అవుతోంది. ఇంటి ఆవరణలో స్విమ్మింగ్‌పూల్‌లోకి చిన్నారి దిగింది. ఆ మెట్లు మీద నుంచి ముందుకు వెళ్లింది. లోతు ఎక్కువగా ఉండడంతో.. ఆ చిన్నారి మునిగిపోతుంది. దీంతో నీటిలో ఆ చిన్నారి గిలగిల కొట్టుకుంటుంది. ఈ విషయాన్ని అక్కడే ఉన్న కుక్క పసిగట్టింది. వెంటనే స్విమ్మింగ్ పూల్‌ వైపు పరుగు పరుగునా వచ్చి.. అందులోకి దూకుంది.


నీటిలో ఊపిరందక గిలగిలలాడుతున్న చిన్నారి.. వెంటనే ఆ కుక్కను గట్టిగా పట్టుకుంది. ఇంతలో ఈ విషయాన్ని కాస్తా దూరంలో ఉన్న ఇద్దరు మహిళలు చూశారు. ఆ వెంటనే వారు స్విమ్మింగ్ పూల్ వైపు పరిగెత్తుకుంటూ వచ్చి అందులోకి దూకారు. ఓ మహిళ ఆ చిన్నారిని నీటిలో నుంచి బయటకు తీసి ఎత్తుకుంది. ఈ ఘటన బ్రెజిల్‌‌లోని చపాడా డోస్ గిమారిస్ ప్రాంతంలో చోటు చేసుకుంది. నవంబర్ 20వ తేదీన ఈ సంఘటన జరిగింది. ఈ పెంపుడు కుక్క పేరు గోల్డెన్ రిట్రీవర్. ఈ కుక్కను చాలా కాలంలో ఆ చిన్నారి కుటుంబ సభ్యులు పెంచుతున్నారు.


ఈ వీడియోను మావికా ఎక్స్‌ పేజీలో పోస్ట్ చేశారు. ఈ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోను వేలాది మంది వీక్షించి.. లైక్ చేశారు. బ్రెజిల్ ఎ ఫోర్ లెగ్‌డ్ హీరో అని ఈ వీడియోకు క్యాప్షన్ పెట్టారు. ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తున్నారు. ఇవి తెలివి తక్కువ జంతువులు కాదు.. మన దేవదూతలు అని ఒకరు వ్యాఖ్యానించారు. గోల్డెన్ రిట్రీవర్.. వాటి సున్నితత్వానికి, పిల్లల పట్ల ప్రేమకు ప్రసిద్ధి చెందినవని మరొకరు పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఇలా వచ్చి.. అలా సెల్ ఫోన్ కొట్టేసింది.. ఆ తర్వాత ఏం చేసిందంటే.. వీడియో వైరల్

పెళ్లిలో కోటి రూపాయల నగదు దండలు.. వరులకు బావ భారీ కానుక

Updated Date - Nov 24 , 2026 | 04:36 PM