ఏపీకి వస్తున్న పెట్టుబడులు చూసి అసూయపడే పరిస్థితిలో పక్క రాష్ట్రాలు: ఎమ్మెల్యే సోమిరెడ్డి
ABN , Publish Date - Nov 23 , 2026 | 12:55 PM
చిన్న రాష్ట్రం ఏపీకి ఇంత భారీ స్థాయిలో పెట్టుబడులు సాధిస్తున్న మంత్రి లోకేష్ బాబును రాజకీయాలకు అతీతంగా అభినందించాల్సిందిపోయి సాక్షి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి విషం కక్కడం దుర్మార్గమని టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు.
అమరావతి, నవంబర్ 23: చిన్న రాష్ట్రం ఏపీకి ఇంత భారీ స్థాయిలో పెట్టుబడులు సాధిస్తున్న మంత్రి లోకేష్ బాబును రాజకీయాలకు అతీతంగా అభినందించాల్సిందిపోయి సాక్షి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి విషం కక్కడం దుర్మార్గమని టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. సోమవారం రాజధాని అమరావతిలో ఆయన మాట్లాడుతూ.. ఏపీకి వస్తున్న పెట్టుబడులు చూసి పక్క రాష్ట్రాలు అసూయపడే పరిస్థితి వచ్చిందని అన్నారు. మన రాష్ట్ర, బిడ్డల భవిష్యత్తును తీర్చిదిద్దేలా పెట్టుబడులు రావడం చూసి అసూయతో రగిలిపోవడం దురదృష్టకరమని ఆయన వ్యాఖ్యానించారు.
జగన్ రెడ్డితో పాటు ఆయనకు చెందిన సాక్షి పత్రికకు కూడా మానవీయ కోణం లేకుండా పోయిందని సోమిరెడ్డి చంద్రమోమన్ రెడ్డి పెదవి విరిచారు. నిద్రలేచినప్పటి నుంచి రాష్ట్రం నాశనమైపోవాలి.. చంద్రబాబు నాయుడికి చెడ్డపేరు రావాలి.. తిరిగి వైసీపీ అధికారంలోకి రావాలనేదే వారి ఉద్దేశమని పేర్కొన్నారు. రాష్ట్రం బాగుండాలని కోరుకుంటూ ప్రజాభిమానం చూరగొనాల్సింది పోయి విషం కక్కడం బాధాకరమని అన్నారు. ఇప్పటికైనా మనస్సు మార్చుకుని రాష్ట్రానికి జరిగే మంచిని స్వాగతించాలని జగన్ రెడ్డికి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి హితవు పలికారు.
రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా పెద్దఎత్తున పెట్టుబడులు, పరిశ్రమలు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తున్నాయని టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డిచంద్రమోహన్ రెడ్డి తెలిపారు. విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ బాబు పెట్టుబడులకు బ్రాండ్ అంబాసిడర్గా నిలుస్తున్నారని చెప్పారు. చిన్న రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్.. జాతీయ స్థాయిలో మూడు, నాలుగు స్థానాల్లో ఉండటం లోకేష్ బాబు కృషితోనే సాధ్యమైందని పేర్కొన్నారు.
2024 జూన్ నుంచి ఇప్పటి వరకు రాష్ట్రానికి రూ.32.49 లక్షల కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలు రాగా.. 22.78 లక్షల ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయని వివరించారు. గూగూల్ రూ.1.33 లక్షల కోట్లు, రిలయన్స్ రూ.43 వేల కోట్లు, బ్రూక్ ఫీల్డ్ రూ.1.06 లక్షల కోట్లు, రెన్యూ రూ.22 వేల కోట్లు.. ఇలా చెప్పుకుంటూ పోతే లక్షల కోట్ల రూపాయిల పెట్టుబడులు వస్తున్నాయని చెప్పారు. తన నియోజకవర్గం సర్వేపల్లిలో శ్యామ్ మెటాలిక్ ఎనర్జీ సంస్థ రూ.3,600 కోట్లతో ప్లాంట్ ఏర్పాటు చేస్తోందని.. పలు పామాయిల్ ప్లాంట్లు కూడా ఏర్పాటవుతున్నాయని తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆసియా పవర్ ఇండెక్స్ 2026లో భారత్కు మూడో స్థానం.. మోదీకి రెండో ర్యాంక్
సత్యసాయి బాబా 101వ జయంతి వేడుకలు ప్రారంభం.. పుట్టపర్తికి పోటెత్తిన భక్తులు