Share News

సత్యసాయి బాబా 101వ జయంతి వేడుకలు ప్రారంభం.. పుట్టపర్తికి పోటెత్తిన భక్తులు

ABN , Publish Date - Nov 23 , 2026 | 10:57 AM

భగవాన్ శ్రీ సత్యసాయి బాబా 101 జయంతి నేడు. ఈ నేపథ్యంలో పుట్టపర్తిలోని హిల్ వ్యూ స్టేడియంలో ఆయన జయంతి వేడుకలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి.

సత్యసాయి బాబా 101వ జయంతి వేడుకలు ప్రారంభం.. పుట్టపర్తికి పోటెత్తిన భక్తులు

పుట్టపర్తి, నవంబర్ 23: భగవాన్ శ్రీ సత్యసాయి బాబా 101 జయంతి నేడు. ఈ నేపథ్యంలో పుట్టపర్తిలోని హిల్ వ్యూ స్టేడియంలో ఆయన జయంతి వేడుకలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. జ్యోతి ప్రజ్వలన చేసి ఈ వేడుకలను శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ప్రతినిధులు ప్రారంభించారు. ఈ వేడుకలకు కేరళం ముఖ్యమంత్రి వీడీ సతీశన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బాబా జయంతి వేడుకలను పురస్కరించుకుని ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు సోమవారం పుట్టపర్తికి భారీగా తరలివచ్చారు. దీంతో పుట్టపర్తి పట్టణం బాబా భక్తులతో కిక్కిరిసిపోయింది.


బాబా జయంతి వేడుకలు సందర్భంగా పట్టణవ్యాప్తంగా సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ వివిధ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తుంది. అలాగే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది. ఇక భక్తుల కోసం ఏపీఎస్ఆర్టీసీ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పుట్టపర్తికి ప్రత్యేక బస్సులు నడుపుతోంది. మరో వైపు బాబా జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది.


బాబా జయంతి సందర్భంగా ఆయనకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఘనంగా నివాళులర్పించారు. అలాగే బాబా ప్రజల కోసం చేసిన సేవలను కొనియాడారు. ఇక ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్.. బాబా భక్తులకు శుభాకాంక్షలు తెలిపారు. బాబా జయంతిని రాష్ట్ర పండగగా నిర్వహిస్తున్నట్లు ఆయన ప్రకటించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఏపీ క్యాబినెట్ భేటీపై కీలక నిర్ణయం.. ఈసారి హైబ్రిడ్ విధానంలో సమావేశం

సత్యసాయి బాబా సేవలు చిరస్మరణీయం.. సీఎం చంద్రబాబు నివాళి

Updated Date - Nov 23 , 2026 | 11:09 AM