Share News

స్వదేశానికి చేరుకున్న షానవాజ్.. స్పందించిన పవన్ కల్యాణ్

ABN , Publish Date - May 08 , 2026 | 09:38 PM

ఒమన్‌లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న అన్నమయ్య జిల్లాలోని వాయల్పాడుకు చెందిన షానవాజ్.. క్షేమంగా స్వదేశానికి చేరుకున్నారని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వెల్లడించారు.

స్వదేశానికి చేరుకున్న షానవాజ్.. స్పందించిన పవన్ కల్యాణ్

అమరావతి, మే 08: ఒమన్‌లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న అన్నమయ్య జిల్లాలోని వాయల్పాడుకు చెందిన షానవాజ్.. క్షేమంగా స్వదేశానికి చేరుకున్నారని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వెల్లడించారు. షానవాజ్ విషయం తన దృష్టికి వచ్చిన వెంటనే.. ఆమె క్షేమంగా స్వదేశానికి తిరిగి రావడానికి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖను @MEAIndia అభ్యర్థించానని తెలిపారు. వారు వెంటనే స్పందించారన్నారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిరంతర సమన్వయం, మానవతా దృక్పథం వల్ల.. షానవాజ్ క్షేమంగా భారత్ చేరుకున్నారని పేర్కొన్నారు. అందుకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ@MEAIndiaకు పవన్ కల్యాణ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.


ఆమె మన మాతృభూమికి క్షేమంగా తిరిగి వచ్చేలా చూడటంలో సహకారం అందించిన భారత రాయబార కార్యాలయం @Indemb_Muscat అధికారులు, ఒమన్ అధికారులకు @Oman_GCకి కూడా డిప్యూటీ సీఎం పవన్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ విషయం సమన్వయం చేసిన జనసేన గల్ఫ్ కేడర్, ఎన్డీఏ కూటమి కేడర్, ఏపీఎన్ఆర్టీ అసోసియేషన్‌ను కూడా పవన్ అభినందనలతో ముంచెత్తారు. బుధవారం రాత్రి ఆమె క్షేమంగా హైదరాబాద్‌లో దిగారని ఏపీ డిప్యూటీ సీఎం చెప్పారు.


శుక్రవారం జనసేన పార్టీ కార్యాలయాన్ని షానవాజ్ సందర్శించారని తెలిపారు. ఆమెను క్షేమంగా నివాసానికి పంపించారని తెలిసి సంతోషిస్తున్నానని ఏపీ డిప్యూటీ సీఎం వివరించారు. ప్రధాని మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం, సంక్షోభ సమయాల్లో భారతీయులను సురక్షితంగా వెనక్కి తీసుకురావడానికి భారత ప్రభుత్వం అసాధారణ ప్రయత్నాలు చేసిందని ఆయన చెప్పారు.


ఇది.. ప్రతి భారతీయుడు ఎక్కడ ఉన్నా వారి పట్ల మన దేశానికి ఉన్న బలమైన నిబద్ధతతోపాటు బాధ్యతను ప్రతిబింబిస్తుందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా కష్ట సమయాల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి తెలుగు వ్యక్తికి అండగా నిలబడటానికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు నిరంతర మద్దతుకు ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ ధన్యవాదాలు తెలిపారు.


ఇటీవల అన్నమయ్య జిల్లాలోని వయల్పాడుకు చెందిన షానవాజ్ ఒమన్‌లో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఓ వీడియోను విడుదల చేశారు. తాను ఒమన్‌లో చిక్కుకుపోయాయని.. తనకు సహాయం చేసి స్వదేశానికి పంపాలంటూ ఆ వీడియోలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను షానవాజ్ కోరింది. సదరు వీడియోపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వెంటనే స్పందించారు. ఈ నేపథ్యంలో ఆమెను ఒమన్ నుంచి స్వదేశానికి తీసుకు వచ్చేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.


ఇవి కూడా చదవండి..

కొత్తగా 12 డయాలసిస్ కేంద్రాల ఏర్పాటు: మంత్రి సత్యకుమార్

కేంద్రం నిధులు ఇవ్వకుంటే.. తెలంగాణ అభివృద్ధి లేదు: కేంద్ర మంత్రి

Read Latest AP News And Telugu News

Updated Date - May 08 , 2026 | 10:02 PM