Share News

పల్నాడు జిల్లాలో ఉరివేసుకొని తండ్రి, కూతురి ఆత్మహత్య

ABN , Publish Date - Jul 05 , 2026 | 08:49 AM

పల్నాడు జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. రొంపిచర్ల మండలం అలవాల గ్రామంలో తండ్రి గొనుగుంట్ల పోతులూరయ్య, ఆయన కుమార్తె రామాంజమ్మ వారింట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు.

పల్నాడు జిల్లాలో ఉరివేసుకొని తండ్రి, కూతురి ఆత్మహత్య
Palnadu Tragedy

పల్నాడు జిల్లా, జులై 5 (ఆంధ్రజ్యోతి): పల్నాడు జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. రొంపిచర్ల మండలం అలవాల గ్రామంలో తండ్రి గొనుగుంట్ల పోతులూరయ్య (60), ఆయన కుమార్తె రామాంజమ్మ (39) వారింట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషయాన్ని పోలీసులకు కుటుంబ సభ్యులు, స్థానికులు సమాచారం అందించారు. సమాచారం అందగానే సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని వివరాలు సేకరించారు.


అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కుటుంబంలో నెలకొన్న విభేదాలు, వ్యక్తిగత సమస్యలు ఈ ఘటనకు కారణమని గ్రామస్తులు, బంధువులు తెలిపారు. అయితే వారి మృతికి గల కచ్చితమైన కారణాలను తెలుసుకునేందుకు పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. పోలీసుల దర్యాప్తు పూర్తయిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.


ఈ వార్తలు కూడా చదవండి...

అల్లూరి ఆశయాలే దేశానికి మార్గదర్శకం: పవన్ కల్యాణ్

డ్వాక్రా మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేలా తృప్తి క్యాంటీన్‌లను ప్రోత్సహిస్తున్నాం: మంత్రి నారాయణ

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Jul 05 , 2026 | 09:35 AM