Share News

నీట్‌ ర్యాంకర్ల జాబితా సిద్ధం

ABN , Publish Date - Aug 01 , 2026 | 08:04 AM

రాష్ట్రంలో ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్‌ ప్రవేశ పరీక్షకు సంబంధించి మొదటి 50 మంది ర్యాంకర్ల పేర్లతో జాబితాను ఎన్టీఆర్‌ హెల్త్‌ వర్సిటీ సిద్ధం చేసింది.

నీట్‌ ర్యాంకర్ల జాబితా సిద్ధం
NEET Rankers List

  • స్టేట్‌ మొదటి ర్యాంకర్‌గా నిలిచిన ఎన్‌.ప్రేరణ

  • మొదటి 50 ర్యాంకర్ల లిస్ట్‌ సిద్ధం చేసిన హెల్త్‌ వర్సిటీ

అమరావతి, జూలై 31(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్‌ ప్రవేశ పరీక్షకు సంబంధించి మొదటి 50 మంది ర్యాంకర్ల పేర్లతో జాబితాను ఎన్టీఆర్‌ హెల్త్‌ వర్సిటీ సిద్ధం చేసింది. ఆల్‌ ఇండియాలో 36వ ర్యాంక్‌ సాధించిన ఎన్‌.ప్రేరణ రాష్ట్రంలో మొదటి ర్యాంకర్‌గా నిలిచారు. ఆల్‌ ఇండియాలో 74వ ర్యాంక్‌ సాధించిన జి.హనీష్‌ రాష్ట్ర స్థాయిలో రెండో ర్యాంకర్‌గా నిలవగా, ఆర్‌.జయషణ్ముఖి(86) మూడవ ర్యాంకర్‌గా, కొండేటి హారిక దేవిశ్రీ (103)నాల్గవ ర్యాంకర్‌గా, వి.శ్రీనివాసరెడ్డి (125)ఐదవ ర్యాంకర్‌గా నిలిచారు. ఆల్‌ ఇండియాలో 1000 ర్యాంక్‌ సాధించిన కసిరెడ్డి హానీష్‌ రెడ్డి రాష్ట్రంలో 50వ ర్యాంకర్‌గా నిలిచారు. రాష్ట్ర వ్యాప్తంగా 33,220 మంది నీట్‌లో అర్హత సాధించగా అందులో అత్యధికంగా 23,213 మంది బాలికలు ర్యాంక్‌లు సాధించారు. 10,007 మంది బాలురు మాత్రమే నీట్‌లో అర్హత సాధించారు. ఆల్‌ ఇండియా కౌన్సెలింగ్‌ అనంతరం రాష్ట్ర స్థాయి కౌన్సెలింగ్‌కు హెల్త్‌ వర్సిటీ నోటిఫికేషన్‌ ఇవ్వనుంది.

Updated Date - Aug 01 , 2026 | 08:04 AM