ప్రజల మనస్సులు గెలవండి.. మళ్లీ, మళ్లీ మనల్ని గెలిపిస్తారు: మంత్రి లోకేశ్
ABN , Publish Date - May 05 , 2026 | 09:14 PM
ప్రజల మనసులు గెలవండి.. మళ్లీ, మళ్లీ మనల్ని గెలిపిస్తారని తెలుగు దేశం పార్టీ క్లస్టర్లు, ఇన్‌చార్జిలకు ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. మంగళవారం అమరావతిలో వారితో కాఫీ కబుర్లు పేరుతో సమావేశం నిర్వహించారు.
అమరావతి, మే 05: ప్రజల మనసులు గెలవండి.. మళ్లీ, మళ్లీ మనల్ని గెలిపిస్తారని తెలుగు దేశం పార్టీ క్లస్టర్లు, ఇన్‌చార్జిలకు ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. మంగళవారం అమరావతిలో వారితో కాఫీ కబుర్లు పేరుతో సమావేశం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమం జనంలోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత కేడర్‌దేనని వెల్లడించారు. పనిచేయని వారి పదవులు ఊడతాయని పార్టీ అధినేత హెచ్చరించారని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వ కొనసాగింపు చాలా అవసరమని ఆయన కుండ బద్దలు కొట్టారు.
మనం చేసిన అభివృద్ధి - సంక్షేమం ప్రజలకు వివరించాలని దిశా నిర్దేశం చేశారు. అహంకారం వీడి సత్ప్రవర్తన, మంచి మాటలతో ప్రజల మనస్సులు గెలవాలంటూ వారికి సూచించారు. తెలుగుదేశం పార్టీ లీడర్లు, కేడర్ సమన్వయం చేసుకుంటూ అనునిత్యం ప్రజలతో మమేకం కావడం ముఖ్యమని వారికి మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. గత ఎన్నికల్లో గొడ్డలి పార్టీ 151 నుంచి 11సీట్లకు దిగజారడానికి వారి అహంకారమే కారణమని వైసీపీని ఉద్దేశించి నారా లోకేశ్ వ్యాఖ్యానించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పాస్టర్లకు ఎస్సీ కుల ధృవీకరణ పత్రాలపై విచారణ.. వాయిదా వేసిన హైకోర్టు
హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు భారీ ఆపరేషన్.. 56 మంది అరెస్ట్
For More AP News And Telugu News