Share News

పాస్టర్లకు ఎస్సీ కుల ధృవీకరణ పత్రాలపై విచారణ.. వాయిదా వేసిన హైకోర్టు

ABN , Publish Date - May 05 , 2026 | 07:37 PM

సరైన విచారణ జరపకుండా పాస్టర్లకు ఎస్సీ కుల ధృవీకరణ పత్రాలు జారీ చేసిన అధికారులపై చర్యలు తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్‌పై మంగళవారం ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది.

పాస్టర్లకు ఎస్సీ కుల ధృవీకరణ పత్రాలపై విచారణ.. వాయిదా వేసిన హైకోర్టు
AP High Court

అమరావతి, మే03: సరైన విచారణ జరపకుండా పాస్టర్లకు ఎస్సీ కుల ధృవీకరణ పత్రాలు జారీ చేసిన అధికారులపై చర్యలు తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్‌పై మంగళవారం ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్లకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అనంతరం జులై 6వ తేదీకి ఈ కేసు విచారణను వాయిదా వేసింది.


చర్చిల్లోని పాస్టర్లకు జారీ చేసిన ఎస్సీ కుల ధృవీకరణ పత్రాలు రద్దు చేసేలా అధికారులను ఆదేశించాలని హైకోర్టులో షెడ్యూల్ కులాల హక్కుల పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు పెద్దిరెడ్డి ప్రసన్న కుమార్ పిటిషన్ దాఖలు చేశారు.


పాస్టర్లకు జారీ చేసిన ఎస్సీ కుల ధృవీకరణ పత్రాలు రద్దు చేయాలని జిల్లా కలెక్టర్లకు ప్రసన్న కుమార్ పలుమార్లు వినతి పత్రాలు సమర్పించారు. అయినా వారి నుంచి ఎటువంటి స్పందన రాలేదు. ఈ నేపథ్యంలో ఆయన ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు పిటిషన్‌లో ప్రసన్న కుమార్ స్పష్టం చేశారు. దీనిపై ఈ రోజు విచారణ జరిపిన ఏపీ హైకోర్టు.. జులై ఆరో తేదీకి ఈ కేసును వాయిదా వేసింది.


ఈ వార్తలు కూడా చదవండి..

కరీంనగర్ జ్యువెలరీ షాపులో కాల్పుల ఘటన.. లాడ్జిలో బస చేసి మరీ..

తెలంగాణ బాగుపడాలంటే ఏకైక మార్గం.. : ఎంపీ ఈటల

For More AP News And Telugu News

Updated Date - May 05 , 2026 | 07:59 PM