కరీంనగర్ జ్యువెలరీ షాపులో కాల్పుల ఘటన.. లాడ్జిలో బస చేసి మరీ..
ABN , Publish Date - May 05 , 2026 | 07:04 PM
కరీంనగర్‌లోని బంగారం షాపు చోరీ కేసులో దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలోని ఒక లాడ్జిలో దుండగులు బస చేసినట్లు గుర్తించారు.
కరీంనగర్, మే05: కరీంనగర్‌లోని బంగారం షాపు చోరీ కేసులో దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలోని ఒక లాడ్జిలో దుండగుల ముఠా బస చేసినట్లు గుర్తించారు. గోదావరి తీరం పక్కనే ఉన్న ప్రైవేట్ లాడ్జిలో వారు రెండు రోజులు ఉన్నట్లు పోలీసులు కనుగొన్నారు. మే 3వ తేదీ ఉదయం లాడ్జిని ఖాళీ చేసిన ఈ ముఠా.. బైక్‌లపై మట్టి రోడ్డు ద్వారా కరీంనగర్ చేరుకున్నట్లు పోలీసులు గుర్తించారు.
ధర్మపురి నుంచి బయలుదేరిన ఈ ముఠా.. ధర్మారం, పెగడపల్లి, రామడుగు మండలాల మీదుగా కరీంనగర్‌కు చేరుకుందని సీసీ కెమెరాల ద్వారా పోలీసులు నిర్ధారించుకున్నారు. ఈ సందర్భంగా ధర్మపురిలో వీరు బస చేసిన లాడ్జిని పోలీసులు తనిఖీ చేశారు. అలాగే సీసీ టీవీ ఫుటేజ్‌ను పోలీసులు జల్లెడ పడుతున్నారు. అదే సమయంలో వారి ఫోన్ కాల్స్‌ను సైతం పోలీసులు పరిశీలిస్తున్నారు. పక్కాగా రెక్కీ చేసిన తర్వాతే కరీంనగర్‌లోని పీఎంజే దుకాణంలో చోరీ చేసి.. సిబ్బందిపై కాల్పులు జరిపినట్లు పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చారు.
మే 3వ తేదీన కరీంనగర్‌లోని పీఎంజీ జ్యువెలరీ షాపులో భారీగా బంగారం చోరీ జరిగింది. బైక్‌లపై సాధారణ కస్టమర్లలాగా వచ్చిన ఐదుగురు నిందితులు.. షాపులో క్షణాల్లో బీభత్సం సృష్టించారు. తుపాకులతో సిబ్బందిని బెదిరించడంతో పాటు.. వారిపై కాల్పులు జరిపారు. దీంతో పలువురు గాయపడ్డారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి.. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. వారిని పట్టించిన వారికి నగదు బహుమతిగా ఇస్తామని పోలీసులు ప్రకటించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
అడ్మిషన్ షెడ్యూల్‌పై ఇంటర్ బోర్డ్ కీలక నిర్ణయం
కాళేశ్వరంపై సీబీఐ విచారణ ఎందుకు ఆలస్యం అవుతుందో చెప్పాలి: టీపీసీసీ చీఫ్
For More TG News And Telugu News