Share News

అడ్మిషన్‌ షెడ్యూల్‌పై ఇంటర్ బోర్డ్ కీలక నిర్ణయం

ABN , Publish Date - May 05 , 2026 | 06:25 PM

ఇంటర్ అడ్మిషన్ షెడ్యూల్‌పై తెలంగాణ బోర్డు ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (టీజీబీఐఈ) కీలక నిర్ణయం తీసుకుంది. 2026-27 విద్య సంవత్సరానికి సంబంధించిన సర్క్యూలర్‌ను తాత్కాలికంగా నిలిపివేసింది.

అడ్మిషన్‌ షెడ్యూల్‌పై ఇంటర్ బోర్డ్ కీలక నిర్ణయం
TGIBE

హైదరాబాద్, మే 05: ఇంటర్ అడ్మిషన్ షెడ్యూల్‌పై తెలంగాణ బోర్డు ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (టీజీబీఐఈ) కీలక నిర్ణయం తీసుకుంది. 2026-27 విద్య సంవత్సరానికి సంబంధించిన సర్క్యూలర్‌ను తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ మేరకు మంగళవారం టీజీబీఐఈ ఆదేశాలు జారీ చేసింది. ప్రతిపాదిత సంస్కరణల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది.


త్వరలో కొత్త మార్గదర్శకాలు విడుదల చేస్తామన్న ఇంటర్ బోర్డు ప్రకటించింది. అన్ని జూనియర్ కాలేజీలకు ఈ ఆదేశాలు జారీ చేసినట్లు వివరించింది. మే 4వ తేదీన ఈ విద్య సంవత్సరానికి సంబంధించిన సర్క్యూలర్‌‌ను టీజీబీఐఈ జారీ చేసిన సంగతి తెలిసిందే.


ఈ వార్తలు కూడా చదవండి..

కాళేశ్వరంపై సీబీఐ విచారణ ఎందుకు ఆలస్యం అవుతుందో చెప్పాలి: టీపీసీసీ చీఫ్

తెలంగాణ బాగుపడాలంటే ఏకైక మార్గం.. : ఎంపీ ఈటల

For More TG News And Telugu News

Updated Date - May 05 , 2026 | 06:32 PM