కూటమి పాలనపై ప్రజలకు వివరించడంలో మైలురాయి సాధించిన టీడీపీ: మంత్రి నారా లోకేశ్
ABN , Publish Date - Sep 04 , 2026 | 01:09 PM
‘ఇంటింటికీ తెలుగుదేశం 2026’ కార్యక్రమాన్ని కోటికిపైగా ఇళ్లకు పార్టీ శ్రేణులు తీసుకెళ్లాయి. ఈ నేపథ్యంలో టీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి నారా లోకేశ్ స్పందించారు.
అమరావతి, సెప్టెంబర్ 04: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన ఈ రెండేళ్లలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించడంతోపాటు వారి సమస్యలను నేరుగా తెలుసుకునే లక్ష్యంతో ‘ఇంటింటికీ తెలుగుదేశం 2026’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమాన్ని కోటికిపైగా ఇళ్లకు పార్టీ శ్రేణులు తీసుకెళ్లాయి. ఈ నేపథ్యంలో టీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి నారా లోకేశ్ ఎక్స్ ఖాతా వేదికగా శుక్రవారం స్పందించారు.
‘కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించడంలో తెలుగుదేశం పార్టీ గొప్ప మైలురాయి సాధించింది. “ఇంటింటికీ తెలుగుదేశం-2026” కార్యక్రమం విజయవంతంగా కోటికిపైగా ఇళ్లకు తీసుకెళ్లిన కార్యకర్తలు, నేతలకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఇంటింటి పర్యటనల్లో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలను కలిసి వివరించిన తీరు చాలా బాగుంది’.
‘కోటి ఇళ్లు సందర్శించడమే కాకుండా ఆయా కుటుంబాల సమస్యలు, స్థానిక అవసరాలు, ప్రభుత్వ పథకాలపై వారి అభిప్రాయాలను తెలుసుకుని ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చిన తెలుగుదేశం కుటుంబానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను’ అని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
భగవద్గీతను అందించిన జగద్గురువు.. శ్రీకృష్ణుడు: సీఎం చంద్రబాబు
For More AP News And Telugu News