వైసీపీ కుట్రలు సహించం.. జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ పూర్తి చేస్తాం: మంత్రి కొల్లు..
ABN , Publish Date - Apr 04 , 2026 | 03:50 PM
వైసీపీ ఎన్ని కుతంత్రాలు చేసినా జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ పనులు పూర్తి చేసి తీరుతామని ఆంధ్రప్రదేశ్ గనులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మత్స్యకారుల జీవితాలు బాగుపడకుండా వైసీపీ కుట్రలు చేస్తోందని మంత్రి ఆరోపించారు.
అమరావతి: వైసీపీ ఎన్ని కుతంత్రాలు చేసినా జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ పనులు పూర్తి చేసి తీరుతామని ఆంధ్రప్రదేశ్ గనులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మత్స్యకారుల జీవితాలు బాగుపడకుండా వైసీపీ కుట్రలు చేస్తోందని మంత్రి ఆరోపించారు. ఆ పార్టీ నేతలు ఏం చేసినా సరే ఫిషింగ్ హార్బర్ పనులు పూర్తి చేస్తామన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి నుంచి జగన్ మోహన్ రెడ్డి వరకూ మత్స్యకారుల జీవితాలతో ఆటలాడుకున్నారని ఆయన ధ్వజమెత్తారు.
నాడు తీరప్రాంత భూములను వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాల్పులు జరిపి మరీ బలవంతంగా లాక్కుంటే.. జీవో 217తో జగన్ మత్స్యకారుల పొట్టకొట్టాడని మంత్రి కొల్లు ఆరోపించారు. తాజాగా పెట్టుబడుల్ని అడ్డుకుంటూ మత్స్యకారుల మధ్య చిచ్చుపెట్టేలా వైసీపీ కుయుక్తులు పన్నుతోందని మండిపడ్డారు. పరిశ్రమలు వచ్చి తీరప్రాంత ప్రజలు బాగుపడటం చూడలేమన్నట్లు ఆ పార్టీ నేతల తీరు ఉందని మంత్రి ఆగ్రహించారు.
పొరుగు రాష్ట్రాల బోట్లను కూటమి ప్రభుత్వం అడ్డుకునేందుకు కృషి చేస్తుంటే.. కుట్రపూరితంగా మత్స్యకారులను రెచ్చగొట్టే పనిలో ఆ పార్టీ ఉందని నిప్పులు చెరిగారు. ఏపీలోని మత్స్యకారుల కోసం ఎలాంటి సాయం చేసేందుకైనా కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా మంత్రి కొల్లు హామీ ఇచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి
పదో తరగతి ఫలితాల్లో 7 మార్కులు కలపనున్న ఎస్ఎస్‌సీ బోర్డు
పల్నాడు జిల్లాలో ఘోర ప్రమాదం.. లారీ కింద పడి దంపతులు దుర్మరణం