Share News

పదో తరగతి ఫలితాల్లో 7 మార్కులు కలపనున్న ఎస్ఎస్‌సీ బోర్డు

ABN , Publish Date - Apr 04 , 2026 | 02:44 PM

ఆంధ్రప్రదేశ్ పదో తరగతి విద్యార్థులకు ఏపీ ఎస్ఎస్‌సీ బోర్డు గుడ్ న్యూస్ చెప్పింది. పరీక్షల్లో సందిగ్ధ సమాధానాలపై అడిషనల్ మార్కులు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది.

పదో తరగతి ఫలితాల్లో 7 మార్కులు కలపనున్న ఎస్ఎస్‌సీ బోర్డు
AP SSC Board Announcement

అమరావతి: ఆంధ్రప్రదేశ్ పదో తరగతి విద్యార్థులకు ఏపీ ఎస్ఎస్‌సీ బోర్డు గుడ్ న్యూస్ చెప్పింది. పరీక్షల్లో సందిగ్ధ సమాధానాలపై అడిషనల్ మార్కులు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. పరీక్షలు రాసిన విద్యార్థులకు తుది ఫలితాల్లో 7 మార్కులు కలపాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రిన్సిపల్ వాల్యుయేషన్ సూచనలను డీఈవోలకు ఎస్ఎస్‌సీ బోర్డు అధికారులు పంపించారు.


ఎస్ఎస్‌సీ బోర్డు ఆదేశాల మేరకు హిందీకి 2 మార్కులు, ఇంగ్లీష్‌కు 5 మార్కులను వాల్యూయేషన్ చేసే ఉపాధ్యాయులు కలపనున్నారు. మొత్తం 3 ప్రశ్నల్లో అస్పష్టత కారణంగా ఆయా ప్రశ్నలకు సమాధానాలు రాసిన విద్యార్థులకు ఈ మార్కులు ఇవ్వనున్నారు. ప్రశ్నాపత్రంలో కొన్ని ప్రశ్నల్లో పొరపాట్లు/ అస్పష్టత ఉన్నట్లు బోర్డు అధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో విద్యార్థులకు నష్టం జరగకుండా గ్రేస్ మార్కులు ఇవ్వాలని ఎస్ఎస్సీ బోర్డు నిర్ణయం తీసుకుంది.


ఈ వార్తలు కూడా చదవండి

ఆనాడు మావిగన్ గుర్తు రాలేదా.. జగన్‌కు కోటంరెడ్డి ప్రశ్న

ఇండిగో విమాన సర్వీసుల వేళల్లో మార్పు

Updated Date - Apr 04 , 2026 | 02:54 PM