Share News

ఏపీ కొత్త సీఎస్‌గా సాయిప్రసాద్.. రేపే బాధ్యతల స్వీకరణ

ABN , Publish Date - Feb 27 , 2026 | 01:15 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(CS)గా సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి జి.సాయిప్రసాద్‌ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ప్రస్తుత సీఎస్‌ కె.విజయానంద్‌ పదవీ కాలం ఫిబ్రవరి 28, 2026 నాటితో ముగియనుంది. ఆయన స్థానంలో జి.సాయిప్రసాద్‌ను ప్రభుత్వం ఇప్పటికే అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. వివరాల్లోకి వెళితే..

ఏపీ కొత్త సీఎస్‌గా సాయిప్రసాద్.. రేపే బాధ్యతల స్వీకరణ
Andhra Pradesh Chief Secretary

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(CS)గా సీనియర్ ఐఏఎస్ అధికారి జి.సాయి ప్రసాద్ పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుత సీఎస్‌ కె.విజయానంద్‌ పదవీ కాలం ఫిబ్రవరి 28, 2026 నాటితో ముగియనుంది. ఆయన స్థానంలో సాయి ప్రసాద్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఇప్పటికే అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. శనివారం ఉదయం ఆయన ఏపీ సచివాలయంలో నూతన సీఎస్‌గా పదవీ బాధ్యతలు చేపడతారు.


1991 ఐఏఎస్ బ్యాచ్ ఏపీ క్యాడర్‌కు చెందిన జి.సాయి ప్రసాద్ ఎంటెక్ పూర్తిచేశారు. 1991 ఐఏఎస్‌కు ఎంపికై 1992 నుంచి 1993 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వరంగల్ అసిస్టెంట్ కలెక్టర్‌గా పనిచేశారు. అనంతరం 1993 నుంచి 1995 వరకు పాడేరు అసిస్టెంట్ కలెక్టర్‌గా పనిచేశారు. 1995 నుంచి 1997 వరకు గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కమీషనర్‌గా విధులు నిర్వహించారు. 1997 నుంచి 1998 వరకు కడప జాయింట్ కలెక్టర్‌గా పనిచేశారు. 2000 నుంచి 2003 వరకూ కర్నూల్ జిల్లా కలెక్టర్‌గా పనిచేశారు. 2010 నుంచి 2011 వరకు ఏపీ హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్‌గా విధులు నిర్వహించారు. 2024 జూన్ నుంచి 2025 జనవరి వరకు జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి‌గా కొనసాగుతున్న సాయి ప్రసాద్ రేపు (శనివారం) నూతన సీఎస్‌గా పదవీ బాధ్యతలు చేపట్టబోతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పోలవరం - నల్లమల సాగర్‌తో తెలుగు రాష్ట్రాలకు లాభం: సీఎం చంద్రబాబు

డయేరియా ప్రబ‌ల‌కుండా ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు

Read Latest Telangana News And AP News And Telugu News

Updated Date - Feb 27 , 2026 | 02:12 PM