Share News

సీఎంకు డిప్యూటీ సీఎం ధన్యవాదాలు

ABN , Publish Date - Mar 03 , 2026 | 08:16 PM

గ్రామాల అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తున్న సీఎం చంద్రబాబు నాయుడికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ధన్యవాదాలు తెలిపారు.

సీఎంకు డిప్యూటీ సీఎం ధన్యవాదాలు
AP CM Chandrababu With Dy CM Pawan Kalyan

అమరావతి, మార్చి 03: గ్రామాల అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తున్న సీఎం చంద్రబాబు నాయుడికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో ప్రతి గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రథమ ప్రాధాన్యం ఇచ్చి.. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి క్లిష్టంగా ఉన్నా - గ్రామాలు అభివృద్ధి పథంలో ముందుకు వెళ్లాలనే సంకల్పానికి బలమిస్తూ తగిన నిధులు సమకూరుస్తున్నారంటూ సీఎం చంద్రబాబు కృషిని ప్రశంసించారు.


మంగళవారం ఈ రోజు సాగిన సుదీర్ఘ సమావేశంలో జల్ జీవన్ మిషన్ ప్రాజెక్ట్ పనులు, గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల నిర్మాణం మరింత వేగవంతం చేయడానికి సీఎం విలువైన సూచనలు అందించారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి సూచనలు అనుసరిస్తూ వికసిత్ భారత్ లక్ష్యంలో భాగమవుతామమని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఎక్స్ ఖాతా వేదికగా సీఎం చంద్రబాబుకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ ధన్యవాదాలు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఇరాన్ దిగి వచ్చింది.. కానీ ఇప్పటికే ఆలస్యమైంది: ట్రంప్

వెంకటగిరి వైసీపీలో అంతర్గత పోరు.. కౌన్సిలర్ల తిరుగుబాటు

Read Latest AP News And Telugu News

Updated Date - Mar 03 , 2026 | 08:52 PM