Share News

వెంకటగిరి వైసీపీలో అంతర్గత పోరు.. కౌన్సిలర్ల తిరుగుబాటు

ABN , Publish Date - Mar 03 , 2026 | 06:08 PM

శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటగిరి మున్సిపాలిటీలో అధికార వైసీపీలో అంతర్గత పోరు నెలకొంది. ప్రస్తుత మున్సిపల్ చైర్ పర్సన్ నక్కా భానుప్రియపై వైసీపీ కౌన్సిలర్లు తిరుగుబాటు చేశారు. కౌన్సిలర్లకు ఇంకా 15 రోజులు గడువు ఉండగా.. మున్సిపల్ చైర్ పర్సన్‌పై తిరుగుబాటు బావుట ఎగురవేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

వెంకటగిరి వైసీపీలో అంతర్గత పోరు.. కౌన్సిలర్ల తిరుగుబాటు

నెల్లూరు, మార్చి 03: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటగిరి మున్సిపాలిటీలో అధికార వైసీపీలో అంతర్గత పోరు నెలకొంది. ప్రస్తుత మున్సిపల్ చైర్ పర్సన్ నక్కా భానుప్రియపై వైసీపీ కౌన్సిలర్లు తిరుగుబాటు చేశారు. కౌన్సిలర్లకు ఇంకా 15 రోజులు గడువు ఉండగా.. మున్సిపల్ చైర్ పర్సన్‌పై తిరుగుబాటు బావుటా ఎగురవేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గతేడాది అంటే.. 2025లోనే చైర్ పర్సన్ నక్కా భానుప్రియపై కౌన్సిలర్లు అవిశ్వాసం ప్రవేశ పట్టారు.


ఈ నేపథ్యంలో సదరు నియోజకవర్గం వైసీపీ పార్టీ ఇంచార్జ్ నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి రంగంలోకి దిగారు. పార్టీ పరువు కాపాడేందుకు కౌన్సిలర్లకు లబ్ధి చేకూర్చడం ద్వారా ఆ అవిశ్వాసం వీగిపోయేలా చేశారు. అనంతరం వైసీపీతోపాటు నేదురుమల్లి రాంకుమార్ రెడ్డికి చైర్ పర్సన్ నక్కా భానుప్రియ ముఖం చాటేశారు. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో చైర్ పర్సన్ నక్కా భానుప్రియపై సొంత పార్టీ కౌన్సిలర్ల చేత నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి తిరుగుబాటు చేయిస్తున్నారంటూ ఒక జోరు చర్చ అయితే వెంకటగిరి నియోజకవర్గంలో సాగుతోంది.


మరో వైపు అవిశ్వాస ప్రక్రియ వేళ తమ మాట వినకుండా పార్టీ ఇంచార్జ్ నేదురుమల్లి మాటే విన్నారని కౌన్సిలర్‌పై చైర్ పర్సన్ నక్కా భానుప్రియ బావ నక్కా వెంకటేశ్వర్లు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అలాగే ప్రతీ నెల సమావేశాలు పెట్టకుండా కౌన్సిలర్లు, చైర్మన్ కలవకుండా ఉండేలా చేయడం కోసం నక్కా వెంకటేశ్వర్లు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అదే విధంగా మున్సిపల్ కార్యాలయానికి చైర్మన్ వెళ్లకుండా నక్కా వెంకటేశ్వర్లు హుకుం జారీ చేశారు.


ఇక మున్సిపల్ అధికారుల చేత ఆఫీస్ ఫైల్స్ ఇంటికి తెప్పించుకొని మరి.. నక్కా వెంకటేశ్వర్లు చైర్మన్‌గా పెత్తనం సాగిస్తున్నారంటూ విమర్శలు వెల్లువెత్తాయి. చైర్మన్ పదవిలో నక్కా భానుప్రియను రబ్బర్ స్టాంప్‌గా మార్చి.. ఆమె బావ నక్కా వెంకటేశ్వర్లు పెత్తనం చేస్తున్నారంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీ కౌన్సిలర్లను లక్ష్యంగా చేసుకుని టీడీపీ శ్రేణులు ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. ఆ ప్రశ్నలకు వైసీపీ కౌన్సిలర్లు సమాధానం చెప్పలేక పోతున్నారు. అలాంటి పరిస్థితుల్లో రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో మన పరిస్థితి, మన పార్టీ పరిస్థితి ఏమిటంటూ వెంకటగిరి వైసీపీ నేతలు అంతర్గత ఆలోచనలతో సతమతమవుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

స్త్రీ శక్తితో తగ్గిన రోడ్డు ప్రమాదాలు.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

విద్యుత్ సంస్థలకు అభినందనలు: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

Read Latest AP News And Telugu News

Updated Date - Mar 03 , 2026 | 06:34 PM