ఇకపై వినుకొండకు అన్నీ మంచి రోజులే: సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Feb 21 , 2026 | 03:00 PM
పల్నాడు అంటేనే పౌరుషాల గడ్డ అని, ఇక్కడకు వస్తే వైబ్రేషన్స్ వస్తాయని సీఎం నారా చంద్రబాబు నాయుడు అన్నారు. వినుకొండలో నిర్వహించిన స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొని ప్రసంగించారు..
పల్నాడు జిల్లా, ఫిబ్రవరి 21: చెత్త నుంచి సంపద సృష్టించడం పట్ల సంతోషంగా ఉందని సీఎం నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) అన్నారు. శనివారం వినుకొండలో నిర్వహించిన స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం స్వచ్ఛ రథాలను ప్రారంభించారు. అనంతరం వినుకొండ సభలో మాట్లాడుతూ.. రాబోయే రోజులన్నీ వినుకొండకు మంచి రోజులే అని అన్నారు. స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్ర కార్యక్రమం కోసం ఇక్కడకు వచ్చానని తెలిపారు. మండలానికి ఒక స్వచ్ఛ రథం ఇచ్చామని.. ప్రతి వారం మండలంలోని అన్ని గ్రామాల్లో స్వచ్ఛ రథం తిరుగుతుందని చెప్పారు.
పల్నాడు అంటేనే పౌరుషాల గడ్డ అని, ఇక్కడకు వస్తే వైబ్రేషన్స్ వస్తాయన్నారు సీఎం చంద్రబాబు. కోటప్పకొండ తిరునాళ్ల ఉత్సవాలను బ్రహ్మాండంగా చేశారని కొనియాడారు. శివరాత్రి ప్రభల కంటే కోటప్పకొండ ప్రభలు ఎంతో ఫేమస్ అని చెప్పారు. మంత్రి నారాయణ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలు నడుస్తున్నాయని వెల్లడించారు. తాను సీఎం అయ్యే సమయానికి రాష్ట్రంలో 108 లక్షల టన్నుల చెత్త రాష్ట్రంలో పేరుకుపోయిందని తెలిపారు. ప్రజలకు స్వచ్ఛమైన నీరు, గాలి ఇవ్వాలన్నదే తన ఉద్దేశమని స్పష్టం చేశారు. అందుకే ప్రతి మూడో శనివారం స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొంటానని సీఎం వివరించారు.
మార్చి 31 నాటికి వందశాతం ఇంటి నుంచి చెత్తను సేకరించేలా చేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. చెత్త ద్వారా మళ్లీ వస్తువులను ఉత్పత్తి చేస్తామని.. విశాఖలో చెత్త నుంచి కరెంటు ఉత్పత్తి చేస్తున్నారని చెప్పారు. మరో ఐదు ప్లాంట్ల ద్వారా కరెంట్‌ను తయారు చేస్తామన్నారు. రాష్ట్రంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను బ్యాన్ చేశామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
వైసీపీ నేతలు ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాల్సిందే: భానుప్రకాశ్ రెడ్డి
డ్రగ్స్‌పై ఈగల్ టీం ఉక్కుపాదం.. గంజాయి సాగును నిర్మూలించాం: ఐజీ రవికృష్ణ
Read Latest AP News And Telugu News