రాజధాని అమరావతిని వ్యతిరేకించిన ఏకైక పార్టీ వైసీపీ: సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Apr 02 , 2026 | 07:33 PM
రాజధాని అమరావతి బిల్లుకు చట్టబద్ధత చరిత్రాత్మకమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభివర్ణించారు. చరిత్ర ఉన్నంత వరకు అమరావతి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
అమరావతి, ఏప్రిల్ 02: రాజధాని అమరావతి బిల్లుకు చట్టబద్ధత చరిత్రాత్మకమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభివర్ణించారు. చరిత్ర ఉన్నంత వరకు అమరావతి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. పార్లమెంట్‌లో ఏపీ పునర్వ్యవస్థీకరణ (సవరణ) బిల్లు-2026 ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. ఈ నేపథ్యంలో గురువారం రాజధాని ప్రాంతంలోని ఉద్దండరాయునిపాలెం గ్రామంలో సంబరాలు జరిగాయి. ఈ సంబరాల్లో సీఎం చంద్రబాబు దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. రాజధానిపై వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మూడు ముక్కలాట ఆడారని మండిపడ్డారు.
ఆ కుట్రలు దాటుకుని అమరావతిని సాధించుకున్నామని సంతోషం వ్యక్తం చేశారు. ప్రజల ఆత్మగౌరవానికి చిహ్నం అమరావతి అని సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా పేర్కొన్నారు. దేశంలోని అన్ని పార్టీలు.. ఈ బిల్లుకు మద్దతు తెలిపాయని వివరించారు. బిల్లుకు మద్దతు తెలిపిన అన్ని పార్టీలకు ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ఏపీ ప్రజల తరఫున ప్రధాని మోదీకి ధన్యవాదాలు సీఎం చంద్రబాబు తెలిపారు.
రాజధాని అమరావతిని వ్యతిరేకించిన ఏకైక పార్టీ వైసీపీ అని సీఎం చంద్రబాబు చెప్పారు. ముళ్ల కంచెలు దాటుకుని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సంఘీభావం తెలిపారని పేర్కొన్నారు. ఇకపై అమరావతిని ఎవరూ ఇంచ్ కూడా కదపలేరని ధీమా వ్యక్తం చేశారు. బెస్ట్ సిటీగా తయారు చేసి అమరావతిని జాతికి అంకితం చేస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పోలవరం డయాఫ్రం వాల్ నిర్మాణం పూర్తి.. ఇంజనీర్లను సన్మానించిన మంత్రి
పార్లమెంట్‌లో అమరావతి బిల్లు ఆమోదం.. చంద్రబాబు ఫస్ట్ రియాక్షన్
For More AP News And Telugu News