Share News

కనకదుర్గమ్మ ఆశీస్సులతో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలి: సీఎం చంద్రబాబు

ABN , Publish Date - Oct 19 , 2026 | 07:04 PM

రాష్ట్ర ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దసరా శుభాకాంక్షలు తెలిపారు. మంగళవారం విజయదశమి. ఈ నేపథ్యంలో సోమవారం తన ఎక్స్ ఖాతా వేదికగా ఏపీ ప్రజలకు ఆయన దసరా శుభాకాంక్షలు చెప్పారు.

కనకదుర్గమ్మ ఆశీస్సులతో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలి: సీఎం చంద్రబాబు

అమరావతి, అక్టోబర్ 19: రాష్ట్ర ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దసరా శుభాకాంక్షలు తెలిపారు. మంగళవారం విజయదశమి. ఈ నేపథ్యంలో సోమవారం తన ఎక్స్ ఖాతా వేదికగా ఏపీ ప్రజలకు ఆయన దసరా శుభాకాంక్షలు చెప్పారు. ‘రాష్ట్ర ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిలిచే దసరా పండుగ మనకు గొప్ప స్ఫూర్తిని ఇస్తుంది. రైతన్న శ్రమకు తగిన ఫలితం, మహిళలకు సాధికారత, యువతకు మంచి భవిష్యత్తు అందించేందుకు మేం చేస్తున్న సంకల్పానికి ఆ జగన్మాత అనుగ్రహం లభించాలని ప్రార్ధిస్తున్నాను’.


‘ఆ కనకదుర్గమ్మ ఆశీస్సులతో ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో విజయాలు సాధిస్తూ, అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని, ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో, శాంతి సౌభాగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రాష్ట్ర ప్రజలందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు’ అని పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

విజయవాడ ఉత్సవ్ ముగింపు వేడుకలు.. 2 వేల మంది కళాకారులతో దసరా కార్నివాల్

నేహాబోరాకు ఢిల్లీ పోలీసుల నోటీసులు.. హైకోర్టును ఆశ్రయించిన ఏఐఎస్ఏ అధ్యక్షురాలు

For More AP News And Telugu News

Updated Date - Oct 19 , 2026 | 08:16 PM