Share News

అమరావతిపై కేంద్ర కేబినెట్ వరాల జల్లు

ABN , Publish Date - Jun 10 , 2026 | 02:04 PM

ఏపీ రాజధాని అమరావతిపై కేంద్ర కేబినెట్ వరాల జల్లు కురిపించింది. సుమారు రూ.2500 కోట్ల వ్యయంతో నిర్మించే రెండు భారీ ప్రాజెక్ట్‌ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

అమరావతిపై కేంద్ర కేబినెట్ వరాల జల్లు

ఇంటర్నెట్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై కేంద్ర కేబినెట్ వరాల జల్లు కురిపించింది. నేడు ఢిల్లీలో సమావేశమైన కేంద్ర మంత్రి మండలి.. సుమారు రూ.2,500 కీలకమైన రెండు పెద్ద ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. వీటిలో ఒకటి కేంద్ర ప్రభుత్వ కార్యాలయ కాంప్లెక్స్ నిర్మాణం కాగా.. మరొకటి కేంద్ర ఉద్యోగుల గృహ సముదాయ నిర్మాణం.


అమరావతిలో 5.35 ఎకరాల్లో రూ.1,299 కోట్ల వ్యయంతో కేంద్ర ప్రభుత్వ ఆఫీస్ కాంప్లెక్స్ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదించింది. స్మార్ట్ సిటీ రూపకల్పనలో భాగంగా ఆధునిక సౌకర్యాలతో నిర్మించే ఈ కాంప్లెక్స్ ద్వారా రాష్ట్రంలో కేంద్ర నిధులు, కార్యాలయాల సమన్వయం మరింత సులభతరం కానుందని అధికారులు తెలిపారు. అదే విధంగా.. మరో 17 ఎకరాల్లో రూ.1,235 కోట్ల వ్యయంతో కేంద్ర ఉద్యోగుల కోసం గృహ సముదాయం నిర్మించేందుకూ ఆమోదముద్ర వేసింది. ఈ గృహాల ద్వారా ఉద్యోగులు సౌకర్యవంతమైన నివాసం పొందడం సహా నూతన కొలువులకు మరింత స్ఫూర్తినిస్తుందని అధికారులు భావిస్తున్నారు.


ఇవీ చదవండి:

తమిళ రాజకీయాల్లోకి రాఘవ లారెన్స్.! కీలక ప్రకటన వాయిదా

పీఓకేలో ఉద్రిక్తత.. కశ్మీర్‌లో జోజిలా సంబరాలు

Updated Date - Jun 10 , 2026 | 02:36 PM