ఏపీలో మున్సిపల్ ఎన్నికలపై కీలక నిర్ణయం.. నవంబర్ ఒకటినే పోలింగ్
ABN , Publish Date - Oct 22 , 2026 | 09:06 PM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 99 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు నవంబర్ ఒకటో తేదీన పోలింగ్ జరగనుంది. మైదుకూరు పురపాలక సంఘానికి పోలింగ్‌ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి అనిల్ చంద్ర పునేఠా వాయిదా వేశారు.
అమరావతి, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 99 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు నవంబర్ ఒకటో తేదీన పోలింగ్ జరగనుంది. మైదుకూరు పురపాలక సంఘానికి పోలింగ్‌ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి అనిల్ చంద్ర పునేఠా వాయిదా వేశారు. మైదుకూరులో మళ్లీ నామినేషన్లు ప్రక్రియ ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు. నవంబర్ మూడో తేదీన కౌంటింగ్ నిర్వహించాలని నిర్ణయించారు.
ఏడు జిల్లాలోని 19 పురపాలక సంఘాలపై ఆరోపణలు రావడంతో వీటిపై కలెక్టర్ల నుంచి నివేదికలను రాష్ట్ర ఎన్నికల కమిషన్ తెప్పించుకున్నారు. న్యాయనిపుణులతో మాట్లాడిన అనంతరం నవంబర్ ఒకటో తేదీన ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. మైదుకూరులో మళ్లీ తాజాగా నామినేషన్లు తీసుకోవాలని నిర్ణయించారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై కూడా సమాలోచనలు చేస్తున్నారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు యథావిధిగా నిర్వహించాలా? లేదా అనే అంశంపై చర్చిస్తున్నారు.
ఇవి కూడా చదవండి...
విశాఖలో రోడ్డు ప్రమాదం.. గాయపడిన విద్యార్థులకు హోంమంత్రి అనిత సాయం
నకిలీ వాట్సాప్ నిర్వాహకులకు పవన్ కల్యాణ్ కార్యాలయం హెచ్చరిక
Read Latest AP News And Telugu News