ఐపీఎస్ సునీల్ కుమార్‌పై ఏపీ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు
ABN , Publish Date - Jun 18 , 2026 | 04:01 PM
ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ నాయక్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గురువారం విచారణ చేపట్టింది. ఈ విచారణ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది.
అమరావతి, జూన్ 18 (ఆంధ్రజ్యోతి): ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ నాయక్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈరోజు(గురువారం) విచారణ చేపట్టింది. ఈ విచారణ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. పార్లమెంట్ సభ్యుడిపై కస్టోడియల్ టార్చర్ వంటి తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక ఐపీఎస్ అధికారికి ముందస్తు బెయిల్ రక్షణగా మారకూడదని స్పష్టం చేసింది. ఈ విచారణ సందర్భంగా న్యాయస్థానం పిటిషనర్‌ను ఉద్దేశించి ‘ఎప్పటిలోగా సరెండర్ అవుతారు?’ అని ప్రశ్నించింది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజాప్రతినిధిపై కస్టోడియల్ టార్చర్ ఆరోపణలు అత్యంత తీవ్రమైనవని న్యాయస్థానం పేర్కొంది.
పార్లమెంట్‌పై దాడి చేసిన వ్యక్తులకు, ఒక పార్లమెంట్ సభ్యుడిని కస్టడీలో వేధించిన వారికి మధ్య పెద్ద తేడా లేదని హైకోర్టు అభిప్రాయపడింది. ఇలాంటి సంఘటనల్లో పాల్గొనకుండా ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి తనను తాను నియంత్రించుకోవాల్సిన బాధ్యత ఉందని వ్యాఖ్యానించింది. ఎంపీని వేధింపులకు గురిచేయబోతున్నారని సునీల్ కుమార్ నాయక్‌కు ముందే తెలుసునని హైకోర్టు తెలిపింది. ఈ వ్యవహారంలో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఆయన కీలక పాత్ర పోషించినట్లు ప్రాథమికంగా కనిపిస్తోందని పేర్కొంది.
అందువల్ల ఆయన స్వచ్ఛందంగా వెళ్లి పోలీసుల ఎదుట సరెండర్ కావడం మంచిదని హైకోర్టు సూచించింది. ముందస్తు బెయిల్ కోరుతూ కొనసాగాలా.?, లేక సరెండర్ అయ్యే మార్గాన్ని ఎంచుకోవాలా.? అనే విషయంపై నిర్ణయం తీసుకుని కోర్టు ముందు హాజరు కావాలని ఆదేశించింది. సునీల్ కుమార్ నాయక్ తరఫు న్యాయవాది స్పందిస్తూ, పిటిషనర్‌తో సంప్రదించి తదుపరి నిర్ణయాన్ని హైకోర్టుకు తెలియజేస్తామని అన్నారు. ఈ కేసుకు సంబంధించిన అన్ని అంశాలను పరిశీలించి న్యాయస్థానం ముందు తమ వాదనలు వినిపిస్తామని తెలిపారు. ఈ నేపథ్యంలో ముందస్తు బెయిల్ పిటిషన్‌పై తుది నిర్ణయం తీసుకోకుండా, ఈ కేసు విచారణను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రేపటికి వాయిదా వేసింది.
ఈ వార్తలు కూడా చదవండి...
సాయికృష్ణ ఘటనపై సీఐ నాగరాజు సస్పెండ్.. సీఎం చంద్రబాబు ఆదేశాలు
అభిమాని కోరిక తీర్చిన పవన్ కల్యాణ్.. నిరంజన్ ఇంటికి కుక్కపిల్ల పంపించిన జనసేనాని
Read Latest AP News And Telangana News And National News
And Telugu News