రాష్ట్రం యూనిట్‌గా ఎంపీపీల రిజర్వేషన్లు
ABN , Publish Date - Aug 19 , 2026 | 08:41 AM
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మండల ప్రజా పరిషత్(ఎంపీపీ) రిజర్వేషన్ల నిర్ధారణకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్సీ జనాభా ఎక్కువగా ఉన్న జిల్లాల్లో బీసీలకు తక్కువ రిజర్వేషన్లు కల్పించాలని డెడికేటెడ్ కమిషన్ సిఫారసు చేసింది.
ఎస్సీలు ఎక్కువ ఉన్న చోట బీసీలకు తగ్గిన కోటా
అందుకే రాష్ట్ర యూనిట్‌గా అమలుకు నిర్ణయం
అమరావతి, ఆగస్టు 18(ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మండల ప్రజా పరిషత్(ఎంపీపీ) రిజర్వేషన్ల నిర్ధారణకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్సీ జనాభా ఎక్కువగా ఉన్న జిల్లాల్లో బీసీలకు తక్కువ రిజర్వేషన్లు కల్పించాలని డెడికేటెడ్ కమిషన్ సిఫారసు చేసింది. నెల్లూరు, తిరుపతి తదితర జిల్లాల్లో బీసీలకు 10 శాతం రిజర్వేషన్ మాత్రమే కేటాయించాలని పేర్కొంది. ఆయా జిల్లాల్లో బీసీ జనాభా ఎక్కువగా ఉన్నప్పటికీ ఎస్సీ, ఎస్టీల జనాభా మరింత ఎక్కువ ఉండటంతో బీసీలకు తక్కువ ప్రకటించాలని తెలిపింది. మొత్తం రిజర్వేషన్లు 50 శాతం లోపు ఉండాల్సి రావడం, ఆయా జిల్లాల్లో ఎస్సీ, ఎస్టీల జనాభా ఆధారంగా బీసీలకు రిజర్వేషన్లు కల్పించాల్సి రావడంతో ఈ సమస్య ఏర్పడింది.
బీసీ జనాభా తక్కువగా ఉన్న చోట.. రిజర్వేషన్లు తక్కువగా ప్రకటించినా ఇబ్బంది ఉండదని, ఎక్కువ సంఖ్యలో బీసీలు ఉన్నప్పటికీ వారికి తగిన రిజర్వేషన్లు కల్పించలేకపోతే బీసీ వర్గాల్లో ఆందోళన పెరుగుతుందని ప్రభుత్వం గుర్తించింది. ఈ వ్యత్యాసాలను తగ్గించేందుకు మండలాలకు రిజర్వేషన్లను రాష్ట్రం యూనిట్‌గా తీసుకోవచ్చని అడ్వొకేట్ జనరల్ సలహా ఇచ్చారు. దీంతో ప్రభుత్వం ఆ మేరకు నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 660 మండల పరిషత్‌ల అధ్యక్షులకు సంబంధించి రిజర్వేషన్ల విషయంలో డెడికేటెడ్ కమిషన్ సిఫారసులు చేసింది. వీటి ప్రకారం కొన్ని జిల్లాల్లో బీసీలకు తక్కువ రిజర్వేషన్లు దక్కే అవకాశముంది. ఈ నేపథ్యంలో రాష్ట్రాన్ని యూనిట్‌గా తీసుకోవడం ద్వారా ఈ వ్యత్యాసాన్ని తగ్గించే అవకాశముందని ప్రభుత్వం భావిస్తోంది.
వార్తలు కూడా చదవండి...
55కు పైగా అజెండా అంశాలతో ఏపీ క్యాబినెట్ భేటీ
నిర్మలా సీతారామన్ నాయకత్వంలో భారత్ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది: పవన్
స్థానిక ఎన్నికలపై మాధవ్ కీలక వ్యాఖ్యలు
Read Latest AP News And Telangana News And National News
And Telugu News