Share News

ఏపీ క్యాబినెట్ కీలక భేటీ.. ఏయే అంశాలపై చర్చిస్తారంటే..

ABN , Publish Date - Mar 26 , 2026 | 07:45 AM

ఇజ్రాయెల్, అమెరికా - ఇరాన్ యుద్ధంపై ఏపీ క్యాబినెట్ నేడు చర్చించనుంది. యుద్ధం కారణంగా రాష్ట్రంలో వివిధ రంగాల‌పై పడుతున్న ప్రభావాన్ని శాఖల వారీగా చర్చించనున్నారు.

ఏపీ క్యాబినెట్ కీలక భేటీ.. ఏయే అంశాలపై చర్చిస్తారంటే..
AP Cabinet Meeting

అమ‌రావ‌తి: ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ ఈరోజు(గురువారం) భేటీ కానుంది. ఉద‌యం 10:30 గంట‌ల‌కు ఏపీ స‌చివాల‌యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంత్రిమండలి సమావేశం కానుంది. ఈ భేటీలో ఆంధ్రప్రదేశ్ రాజధానిపై కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ఏపీ రాజ‌ధానిగా అమ‌రావ‌తిని ఖ‌రారు చేస్తూ మంత్రివ‌ర్గ స‌మావేశంలో తీర్మానం చేసే అవకాశం కనిపిస్తోంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ సూచ‌న‌లతో ఈనెల 28 ఉద‌యం 11 గంట‌ల‌కు అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.


మరోవైపు ఇజ్రాయెల్, అమెరికా - ఇరాన్ యుద్ధంపైనా చర్చించనున్నారు. యుద్ధం కారణంగా రాష్ట్రంలో వివిధ రంగాల‌పై పడుతున్న ప్రభావాన్ని శాఖల వారీగా చర్చించనున్నారు. ఇప్పటికే గ్యాస్ కొర‌త‌ వదంతులు ప్రచారం కాగా.. ఆ ప్రభావం ప‌లు రంగాల‌పై పడింది. ప‌లు చోట్ల హోట‌ల్స్ మూసివేశారు. దీంతో ఎల్‌పీజీ నుంచి పీఎన్‌జీకి కనెక్షన్లు మార్చే అంశంపై చర్చించే అవకాశం కనిపిస్తోంది. గ్యాస్ సిలిండ‌ర్ల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా మంత్రిమండలి కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం. న్యాచురల్ గ్యాస్ పాలసీ ఫర్ ప్రమోషన్ ఇన్ కమర్షియల్ సెక్టార్ పాలసీకి ఆమోదం తెలపనుంది ఏపీ క్యాబినెట్.


ఈ వార్తలు కూడా చదవండి

ఘోర ప్రమాదం.. 10 మంది సజీవ దహనం..

జీఆర్‌ఎంబీ సభ్య కార్యదర్శిగా అఖిలేశ్‌ కుమార్‌ ఝూ

Updated Date - Mar 26 , 2026 | 08:16 AM