శత్రుదేశాల నౌకల్ని మాత్రమే హోర్ముజ్ జలసంధి ద్వారా వెళ్లనివ్వం: ఇరాన్
ABN , Publish Date - Mar 26 , 2026 | 06:54 AM
శత్రుదేశాల నౌకల్ని మాత్రమే హోర్ముజ్ జలసంధి ద్వారా వెళ్లనివ్వమని, మిత్రదేశాలకు, సాధారణ వాణిజ్యానికి ఎలాంటి అడ్డంకులు ఉండవని ఇరాన్ స్పష్టం చేసింది. అదే సమయంలో దేశ భద్రతకు ముప్పు వాటిల్లితే జలసంధిని మూసివేసే హక్కు ఇరాన్‌కు ఉందని ఆదేశ విదేశాంగ మంత్రి అరాగ్చీ చెప్పారు.
టెహ్రాన్, మార్చి 26: ప్రపంచ చమురు రవాణాలో అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధి విషయంలో ఇరాన్ ప్రభుత్వం మరోసారి స్పష్టతనిచ్చింది. ఈ మార్గం కేవలం తమ 'శత్రువులకు' మాత్రమే మూసివేస్తామని, మిత్రదేశాలకు, సాధారణ వాణిజ్యానికి ఎటువంటి అడ్డంకులు ఉండవని ఇరాన్ స్పష్టం చేసింది. అదే సమయంలో భద్రతకు ముప్పు వాటిల్లితే హోర్ముజ్ జలసంధిని మూసివేసే హక్కు ఇరాన్‌కు ఉందని ఆ దేశ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ చెప్పారు.
ప్రపంచ చమురు సరఫరాలో దాదాపు ఐదోవంతు (20 శాతం) ఈ జలసంధి ద్వారానే జరుగుతుంది. ఇది మూతపడితే అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు ఆకాశాన్ని తాకుతాయి.. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభానికి దారితీసే అవకాశం ఉంది. ఇరాన్ తాజా ప్రకటన భారత్ వంటి మిత్రదేశాలకు సానుకూల అంశం. భారత్ తన చమురు అవసరాల కోసం ఈ మార్గంపైనే ఎక్కువగా ఆధారపడుతోంది.
ఈ వార్తలు కూడా చదవండి:
సీఎం రేవంత్ కేరళ పర్యటన రద్దు
ఏప్రిల్ 1 నుంచి చికెన్ షాపులు బంద్!
Read Latest Telangana News and National News