Share News

జయహో బీసీ!

ABN , Publish Date - Aug 19 , 2026 | 07:45 AM

బీసీల అభ్యున్నతే కూటమి ప్రభుత్వ లక్ష్యమని.. వారి సామాజిక, రాజకీయ అభ్యున్నతి కోసం మంత్రివర్గ సమావేశంలో మూడు కీలక నిర్ణయాలు తీసుకున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు.

జయహో బీసీ!

  • స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల పెంపు..

  • గ్రామీణంలో 34శాతం, పట్టణాల్లో 33.33శాతం కోటాక్యాబినెట్‌ నిర్ణయాన్ని అసెంబ్లీలో ప్రకటించిన సీఎం చంద్రబాబు

  • బీసీల అభ్యున్నతే కూటమి లక్ష్యం

  • వారికి రిజర్వేషన్‌ సహా 3 కీలక నిర్ణయాలు

  • మేయర్లు, చైర్‌పర్సన్లకు ప్రత్యక్ష ఎన్నికలు

  • 34ు అంటే అంకెలు కాదు.. వారికి ప్రాతినిధ్యం

  • బీసీలకు 1986లో తొలిసారి ఎన్టీఆర్‌ 20ు

  • కోటా ఇచ్చారు.. 1995లో నేను 34ు చేశా

  • 2001, 06, 13ల్లోనూ ఇదే కోటా

  • వైసీపీ ప్రభుత్వం 24 శాతానికి కుదించింది

  • 16,800 మంది బీసీల రాజకీయ

  • అవకాశాలను కాలరాసింది

  • బీసీ కోటాకు మేం ఆమోదం తెలపగానే

  • కోర్టుల్లో కేసులకు వైసీపీ సిద్ధం

  • ఇలా చేస్తే చరిత్రహీనులవుతారు: సీఎం

  • హర్షాతిరేకాలతో ఎమ్మెల్యేల ఆమోదం

  • చంద్రబాబుకు అభినందనలు, ధన్యవాదాలు

ఎన్టీఆర్‌ టీడీపీ పెట్టిన తర్వాత బీసీలకు రాజ్యాధికారం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఎర్రన్నాయుడు, యనమల రామకృష్ణుడు, స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు, దేవేందర్‌గౌడ్‌ లాంటి బీసీ నేతలు బలమైన నాయకులుగా ఎదిగారు.

బీసీలు, తెలుగుదేశం మధ్య అవినాభావ సంబంధం ఉంది. 1986లో బీసీలకు తొలిసారి స్థానిక సంస్థల్లో 20ు రిజర్వేషన్లు కల్పించిన ఘనత ఎన్టీఆర్‌దే. 1995లో నేను సీఎంగా ఉన్నప్పుడు 34ు రిజర్వేషన్‌ ఇచ్చాను. 2013 వరకు ఎన్నికల్లో ఆ కోటాయే అమలైంది.

-సీఎం చంద్రబాబు

అమరావతి, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): బీసీల అభ్యున్నతే కూటమి ప్రభుత్వ లక్ష్యమని.. వారి సామాజిక, రాజకీయ అభ్యున్నతి కోసం మంత్రివర్గ సమావేశంలో మూడు కీలక నిర్ణయాలు తీసుకున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. వారికి గ్రామీణ స్థానిక సంస్థల్లో 34 శాతం, పట్టణ స్థానిక సంస్థల్లో 33.33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని.. మేయర్లు, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పదవులకు ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించామన్నారు. ఆయారాం గయారాం కాకుండా స్థానిక సంస్థల్లో సుస్థిర పాలన అందించేందుకు ఇది దోహదపడుతుందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 28 జిల్లా పరిషత్‌ల ఏర్పాటుకు కూడా నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. మంగళవారం అసెంబ్లీలో స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లపై చర్చ సందర్భంగా ఆయన ప్రసంగించారు. పంచాయతీ నుంచి పార్లమెంటు దాకా సామాజిక న్యాయమే అజెండాగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని స్పష్టంచేశారు.

CBN.jpg

నిబంధనలకు అనుగుణంగా అన్ని పరిమితులకూ లోబడి స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్ల పెంపుపై నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇది చరిత్రలో నిలిచిపోతుందన్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లను వర్తింపజేస్తూ ఎన్టీఆర్‌ నాడు తీసుకున్న నిర్ణయం మొదలుకొని ఇప్పటి వరకు జరిగిన పరిణామాలను సభలో ఆయన వివరించారు. 1995లో ఉమ్మడి రాష్ట్రానికి తొలిసారి సీఎంగా ఉన్నప్పుడు తాను చేసిన పంచాయతీరాజ్‌ చట్టం ప్రకారం 34 శాతం రిజర్వేషన్ల పెంపును అమలు చేశామని తెలిపారు. 1995, 2001, 2006, 2013 సంవత్సరాల్లో 34 శాతం రిజర్వేషన్లతోనే స్థానిక ఎన్నికలు నిర్వహించామని గుర్తుచేశారు. గత వైసీపీ ప్రభుత్వం వాటిని కాపాడకపోగా.. కోటాను 24 శాతానికి కుదించి.. 16,800 మంది బీసీల రాజకీయ అవకాశాలను కాలరాసిందని విమర్శించారు. యాభైకి పైగా బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసి.. కనీసం కుర్చీలు కూడా వేయకుండా అవమానించిందని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం వెనుకబడిన వర్గాలకు అండగా ఉంటుందన్నారు. సీఎం ప్రసంగం ముగిసిన వెంటనే సభలోని మంత్రులు, ఎమ్మెల్యేలు నిల్చొని స్టాండింగ్‌ ఒవేషన్‌తో అభినందించడంతో పాటు ఆయన నిర్ణయానికి ఆమోదం కూడా తెలిపారు. బీసీ సామాజికవర్గ మంత్రులు, ఎమ్మెల్యేలు ఆయన వద్దకు వెళ్లి కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రసంగంలో సీఎం ఇంకా ఏమన్నారంటే..

నిర్ణయాధికారంలో భాగస్వామ్యం..

రాష్ట్రంలో 50.54 శాతం మంది బీసీ జనాభా ఉన్నారు. వారికి న్యాయం జరగాలి. 34 శాతం రిజర్వేషన్‌ అంటే నిర్ణయాధికారంలో భాగస్వామ్యం. 34 శాతం కోటాకు ఎన్నికల్లో ఎన్‌డీఏ హామీ ఇచ్చింది. దీనితోపాటు కూటమి ప్రభుత్వ రాజకీయ సిద్ధాంతంగా ఈ నిర్ణయం తీసుకుంది. బీసీ రిజర్వేషన్ల విషయంలో తెలుగుదేశానికి ముందు, ఆ తర్వాత అని స్పష్టంగా చెప్పవచ్చు. బీసీలను ఆదుకుంది ఆనాడు టీడీపీ.. ఇప్పుడు కూటమి ప్రభుత్వం. 1995లో నేను వారికి 34 శాతం రిజర్వేషన్లు కల్పించా. ఇదే కోటాతో 1995, 2001, 2006, 2013లలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిపాం. అయితే 2019లో అధికారంలోకి వచ్చినవారు బీసీలకు అన్యాయం చేశారు. 34 శాతం ఉండే రిజర్వేషన్లను 559, 560 జీవోల ద్వారా 24.15 శాతానికి తగ్గించారు. 176 జీవో తెచ్చి నాటకాలాడారు. సుప్రీంకోర్టులో అప్పీలు చేయకుండా వదిలేశారు. బీసీలకు ద్రోహం చేయడంలో వాళ్లు నంబర్‌ వన్‌. మేం బీసీలకు విద్య, నైపుణ్యం, ఉపాధి, ఎంటర్‌ప్రెన్యూర్‌, రాజకీయ ప్రాతినిధ్యం ద్వారా సముచిత స్థానం కల్పిస్తాం. పంచాయతీల నుంచి కేంద్ర మంత్రివర్గం వరకూ ప్రాధాన్యం ఇచ్చేలా చర్యలు చేపడతాం. శాసనసభలో మనం కోటా ప్రకటించగానే రేపు ఉదయమే ఆ పార్టీ (వైసీపీ) కేసులు వేసేందుకు సిద్ధంగా ఉంటుంది. మెగా డీఎస్సీ విషయంలోనూ వందల కేసులు వేశారు. బీసీ కోటా విషయంలో కూడా కోర్టు కేసులు వేస్తే చరిత్రహీనులుగా మిగిలిపోతారు. బీసీ రిజర్వేషన్లు ఎవరికీ వ్యతిరేకం కాదు.

గుర్తిస్తే నాయకులుగా ఎదుగుతారు..

బీసీలను పార్టీ గుర్తించి స్థానిక సంస్థల్లో భాగస్వామ్యం కల్పిస్తే నాయకులుగా ఎదుగుతారు. గత పాలకులు బీసీలపై కక్ష గట్టారు. రాజకీయ విద్వేషం, వారి వెనుక ఎవరూ లేరన్న భావనతోనే ఇబ్బందులు పెట్టారు. అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, అయ్యన్నపాత్రుడు, పల్లా శ్రీనివాస్‌, కూన రవికుమార్‌ వంటి బీసీ నేతలెందరిపైనో కేసులు పెట్టి వేధించారు. రేపల్లెలో అమర్నాఽథ్‌గౌడ్‌ అనే కుర్రాడిని పెట్రోలు పోసి తగులబెట్టారు. టీడీపీకి మద్దతు ఇస్తున్నారన్న కారణంతో తోట చంద్రయ్య గొంతుపై కత్తిపెట్టారు. కంచర్ల జాలయ్య, నందం సుబ్బయ్య లాంటి వారి పార్టీ కోసం ప్రాణాలు పోగొట్టుకున్నారు. కానీ సిద్ధాంతాలను వదులుకోలేదు. స్థిరమైన పాలన ఇవ్వడానికి కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ప్రత్యక్ష ఎన్నికలకు శ్రీకారం చుడుతున్నాం. జిల్లాల విభజన జరిగినా జిల్లా పరిషత్‌లు 13 మాత్రమే ఉన్నాయి. ఇక 28 జిల్లా పరిషత్‌లు ఏర్పాటు చేస్తాం. గ్రామీణ, పట్టణ ప్రాంతాలను గాంధీజీ స్ఫూర్తితో అభివృద్ధి చేసేలా మంచి నాయకత్వాన్ని అందిస్తాం.

ఆర్థిక అసమానతలు లేకుండా జీవన ప్రమాణాలు పెంచుతూ బీసీలకు సాధికారిత కల్పించాం. వారికి చట్టపరంగా, రాజ్యాంగబద్ధంగా, న్యాయబద్ధంగా న్యాయం జరిగేవరకూ అండగా ఉంటాం. బీసీలంటే వెనుకబడినవారు కాదు. అవకాశం రాక వెనుకబడినవారు మాత్రమే.

రాజ్యాంగ పరిధిలో సామాజిక న్యాయం సాధించడమే లక్ష్యం. సమాజంలో ప్రతి వర్గానికీ అవకాశాలు కల్పించడమే నిజమైన అభివృద్ధి. రోడ్లు, భవనాలు, మౌలిక వసతుల కల్పనే అభివృద్ధి కాదు. చిట్టచివరి వ్యక్తిని సైతం ముందుకు తీసుకురావడమే అభివృద్ధి.

- సీఎం చంద్రబాబు

34 అంటే సంఖ్య కాదు..

బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అంటే 3, 4 సంఖ్య కాదు.. రాజకీయ ప్రాతినిధ్యం.. నిర్ణయాధికారంలో భాగస్వామ్యం.. తరతరాలుగా వెనుకబడిన కులాలకు అవకాశ ద్వారం.. సామాజిక న్యాయానికి ఎన్‌డీఏ ఇచ్చిన గౌరవం. ఈ రిజర్వేషన్లు, ప్రత్యక్ష ఎన్నికల కోసమే ప్రత్యేక క్యాబినెట్‌ సమావేశం నిర్వహించాం. కూటమి పార్టీలు కలిసికట్టుగా స్థానిక ఎన్నికల్లో పనిచేయాలి. సామాజిక న్యాయం అజెండాతో టీడీపీ పనిచేయడం వల్లే ఎర్రన్నాయుడు, కేఈ కృష్ణమూర్తి, యనమల రామకృష్ణుడు, దేవేందర్‌గౌడ్‌, అయ్యన్నపాత్రుడు వంటి బలమైన బీసీ నాయకత్వం వచ్చింది. బీసీ రిజర్వేషన్ల ఉత్తర్వులతో పాటు చట్టపరంగా వాటికి బలం చేకూరేవరకూ అండగా నిలుస్తాం.

ఆర్థిక సంఘం నిధుల కోసం..

స్థానిక ఎన్నికలు పెట్టడం చాలా అవసరం. అప్పుడే 16వ ఆర్థిక సంఘం నిధులు వస్తాయి. గ్రామీణ ప్రాంతాలకు రూ.2300 కోట్లు, పట్టణ ప్రాంతాలకు రూ.1562 కోట్లు గ్రాంట్లుగా వచ్చే అవకాశముంటుంది. స్థానిక ఎన్నికల్లో సరైన అభ్యర్థుల ఎంపిక ద్వారా.. సరైన నాయకత్వాన్ని, భావి నాయకత్వాన్ని ఇవ్వాలని కూటమి నేతలను కోరుతున్నాను. 34 శాతం బీసీ రిజర్వేషన్లలను శాసనసభ కూడా ఆమోదించాలని కోరుతున్నాను. ఇంతటి చారిత్రక నిర్ణయం సమయంలోనైనా వైసీపీ ఎమ్మెల్యేలు సభకు హాజరవుతారని భావించాను. కానీ స్వాతంత్య్ర దినోత్సవం రోజున కూడా వారు జాతీయ జెండాను అవమానించేలా వ్యవహరించారు. త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయకుండా నిర్లక్ష్యం చేసిన వ్యక్తులను ఏమనాలి?

మొదటిసారిగా వడ్డెర్లకు అవకాశం

చరిత్రలో మొదటిసారి వడ్డెర్లకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాం. సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తూ ఎస్సీ సామాజికవర్గం నుంచి వర్ల రామయ్యను, వడ్డెర సామాజికవర్గం నుంచి రమాదేవిని ఎంపిక చేశాం. ఎన్నికల్లో ఎమ్మెల్యే సీటు ఇవ్వలేకపోయినందున ఒక సాధారణ మహిళకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చాం. వడ్డెర్లకు ఇప్పటికే 10 శాతం మైనింగ్‌ లీజులిచ్చాం. లీజుకు చెల్లించే డబ్బుల్లోనూ సబ్సిడీ ఇస్తున్నాం. బీసీ గురుకులాలు.. మిగిలిన గురుకులాల కంటే అద్భుత ఫలితాలు సాధిస్తున్నాయి. ఇందుకు ఆ శాఖ మంత్రిని అభినందిస్తున్నాం.

వార్తలు కూడా చదవండి...

55కు పైగా అజెండా అంశాలతో ఏపీ క్యాబినెట్ భేటీ

నిర్మలా సీతారామన్ నాయకత్వంలో భారత్ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది: పవన్

స్థానిక ఎన్నికలపై మాధవ్ కీలక వ్యాఖ్యలు

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Aug 19 , 2026 | 07:45 AM