తిరుమల లడ్డూ కల్తీ కేసుపై ఏపీ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు
ABN , Publish Date - Feb 27 , 2026 | 10:00 PM
తిరుమల తిరుమల వేంకటేశ్వర స్వామి ఆలయంలో లడ్డూ కల్తీ వ్యవహారం సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రధాన చర్యలు ప్రారంభించింది. గతంలో ఈ వ్యవహారంపై సీబీఐ సిట్ కొంతమంది అధికారులపై చర్యలు తీసుకోవాలని నివేదిక సబ్మిట్ చేసిన విషయం తెలిసిందే.
అమరావతి, ఫిబ్రవరి 27 (ఆంధ్రజ్యోతి): తిరుమల తిరుమల వేంకటేశ్వరస్వామి ఆలయంలో లడ్డూ కల్తీ వ్యవహారం సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government) ప్రధాన చర్యలు ప్రారంభించింది. గతంలో ఈ వ్యవహారంపై సీబీఐ సిట్ కొంతమంది అధికారులపై చర్యలు తీసుకోవాలని నివేదిక సబ్మిట్ చేసిన విషయం తెలిసిందే. ఆ నివేదికను ఆధారంగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దినేశ్ కుమార్‌ను ఈ కేసును నిర్వహించే విధంగా ఏపీ ప్రభుత్వం నియమించింది. ఈమేరకు ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి కావేటి దయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు.
దినేశ్ కుమార్ నియామకం..
సీబీఐ నివేదిక ఆధారంగా తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం పర్యవేక్షించడానికి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దినేశ్ కుమార్‌ను ముఖ్య అధికారిగా ఏపీ సర్కార్ నియమించింది. ఆయన బాధ్యతల్లో లడ్డూ కల్తీ వ్యవహారం, అధికారులపై అవసరమైన చర్యల పర్యవేక్షణ, నివేదికలో సూచించిన మార్గదర్శకాలను అమలు చేయడం ప్రధానంగా ఉంది.
సహకరించే ఇతర అధికారుల నియామకాలు..
దినేశ్ కుమార్‌కు ఈ బాధ్యతను సమర్ధవంతంగా నిర్వర్తించడానికి అనేక మంది సహకార అధికారులను ఏపీ సర్కార్ నియమించింది. దినేశ్ కుమార్‌కు ఓఎస్డీగా రిటైర్డ్ ఐఎఫ్ఎస్ అధికారి మునేంద్రను నియమించింది. రిటైర్డ్ సహాయ కార్యదర్శిగా పీబీవీఎస్ఎస్ శివకుమార్‌ను నియమించింది. దినేశ్ కుమార్‌కు అసిస్టెంట్‌గా ఆర్టీజీఎస్ డిప్యూటీ సీఈవో డీసీ మాధురిని నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విధంగా అనుభవజ్ఞులైన అధికారుల బృందం ద్వారా లడ్డూ వ్యవహారాన్ని సమర్థవంతంగా పరిశీలించడానికి ఏపీ సర్కార్ పటిష్ట చర్యలు చేపట్టింది.
ప్రభుత్వ ఉత్తర్వులు..
ఈ నియామకాల కోసం అధికారికంగా ఏపీ ప్రభుత్వంప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది. ఉత్తర్వుల ప్రకారం, దినేశ్ కుమార్, సహకార బృందం తక్షణ చర్యలు చేపట్టి లడ్డూ కల్తీ కేసులో సీబీఐ నివేదికలో సూచించిన చర్యలను అమలు చేయాలని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
జగన్ హయాంలో వ్యవసాయ రంగం తీవ్రంగా నష్టపోయింది: సీఎం చంద్రబాబు
జగన్ హయాంలో పరిశ్రమలు ఏపీ నుంచి వెళ్లిపోయాయి.. మంత్రి టీజీ భరత్ ధ్వజం
Read Latest Telangana News And AP News And Telugu News