ఏలూరులో పోలీసుల నిర్లక్ష్యం.. రెండు రోజులుగా రోడ్డుపక్కనే మృతదేహం!
ABN , Publish Date - Oct 31 , 2026 | 02:08 PM
రెండు రోజులుగా రోడ్డుపక్కనే పడి ఉన్న మృతదేహాన్ని గుర్తించని ఏలూరు జిల్లా పోలీసుల నిర్లక్ష్యంపై జిల్లా వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఏలూరు జిల్లా, అక్టోబర్ 31: జిల్లాలో పోలీసుల నిర్లక్ష్యం చర్చనీయాంశమైంది. రెండు రోజులుగా రోడ్డు పక్కనే పడి ఉన్న మృతదేహాన్ని గుర్తించక పోవడమేమిటని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వివరాల్లోకి వెళితే..
స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. ఈ నెల అక్టోబర్ 29వ తేదీన ఏలూరు జిల్లాలోని ఆగిరిపల్లి మండలంలో ఓ ప్రమాదం చోటుచేసుకుంది. మండలంలోని ఎస్ఏ పేట వద్ద అర్ధరాత్రి.. ప్రమాదవశాత్తు ఓ బీర్ లోడ్ లారీ బోల్తా పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. రోడ్డుపై అడ్డంగా ఉన్న లారీని తొలగించడంలో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో లారీ క్యాబిన్లో ఇరుక్కొని ఉన్న ఓ వ్యక్తి మృతదేహం కనిపించగా.. పక్కనే ఓ ద్విచక్రవాహనాన్ని గుర్తించారు. కాగా.. మృతదేహాన్ని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పరిశీలించిన వైద్యులు.. ఆ వ్యక్తి లారీ ప్రమాదం వల్ల మృతి చెందలేదని.. రెండు రోజుల క్రితమే మరణించి ఉంటాడని ధ్రువీకరించారు.
దీంతో కంగుతిన్న పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టగా.. మృతుడిని శోభనాపురం గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. రెండు రోజుల క్రితం జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో మరణించినట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో రెండు రోజులుగా రోడ్డు పక్కనే పడి ఉన్న మృతదేహాన్ని గుర్తించకపోవడం.. పోలీసుల నిర్లక్ష్యానికి నిదర్శనమంటూ తీవ్రమైన విమర్శలు వినిపిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి...
విజయవాడలో ఎన్నికల సామాగ్రి పంపిణీ.. పోలింగ్‌కు సర్వం సిద్ధం
అక్రమాలు నిరూపిస్తే రాజీనామా చేస్తా.. జగన్‌కు మంత్రి సత్యకుమార్ ఛాలెంజ్
Read Latest AP News And Telugu News