రాత్రంతా పోలీసుల విచారణ.. సహకరించని అనంతబాబు
ABN , Publish Date - Apr 25 , 2026 | 08:17 AM
కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో అరెస్టయిన వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబు విచారణ కొనసాగుతుంది. శుక్రవారం రాత్రంతా అనంత బాబును పోలీసులు విచారించారు.
కాకినాడ, ఏప్రిల్25: కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో అరెస్టయిన వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబు విచారణ కొనసాగుతుంది. శుక్రవారం రాత్రంతా అనంత బాబును పోలీసులు విచారించారు. ఈ సందర్భంగా పోలీస్ విచారణకు ఆయన ఏ మాత్రం సహకరించలేదు. పోలీసులు 30 ప్రశ్నలు సంధిస్తే.. కేవలం ఆరు ప్రశ్నలకు మాత్రమే అనంతబాబు జవాబు ఇచ్చారు. ఈ హత్య కేసులో సాక్షులకు నగదు ఇచ్చిన వాళ్లు ఎవరో తనకు తెలియదంటూ పోలీసులతో ఆయన బుకాయించినట్లు తెలుస్తోంది. శనివారం కోర్టులో అనంతబాబును పోలీసులు హాజరుపర్చనున్నారు. ఇక మూడు రోజులు అజ్ఞాతంలో ఉన్న అనంతబాబుకు ఆశ్రయం ఇచ్చింది వైసీపీ నేతలే అని ఈ విచారణలో స్పష్టమైంది. ఏలేశ్వరంలో వైసీపీ మాజీ కౌన్సిలర్ ఒక రోజు.. మరో రెండు రోజులు రాజమహేంద్రవరంలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఇంట్లో అనంతబాబు ఆశ్రయం పొందినట్లు పోలీసులు గుర్తించారు.
కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో సాక్షులను నగదు ఇచ్చి లొంగదీసుకునేందుకు వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు ప్రయత్నించారు. తన మాట వినకుంటే చంపేస్తామంటూ వారిని బెదిరించారు. ఈ విషయం బహిర్గతం కావడంతో.. కాకినాడలోని సర్పవరం పోలీసులు రంగంలోకి దిగారు. సదరు సాక్షులను పోలీసులు విచారించారు. అనంతబాబు బెదిరింపులు నిజమని రుజువు అయింది. దీంతో అనంతబాబును అరెస్ట్ చేసేందుకు కాకినాడలోని నివాసానికి పోలీసులు వెళ్లారు. అప్పటికే ఆయన అక్కడి నుంచి తప్పించుకున్నారు. అయితే శుక్రవారం రాజమండ్రి జిల్లా కోర్టులో విచారణకు అనంత బాబు హాజరయ్యారు. దీంతో ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేసి సర్పవరం పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
For More AP News And Telugu News