Share News

జైల్లో ప్రత్యేక సదుపాయాలు కోరిన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు

ABN , Publish Date - May 02 , 2026 | 07:12 PM

రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు ప్రత్యేక సదుపాయాలు కోరిన అంశంపై జైలు అధికారులు స్పందించారు. జైలు నిబంధనలు, కోర్టు ఆదేశాల ప్రకారమే సదుపాయాలు కల్పిస్తామని అధికారులు స్పష్టం చేశారు.

జైల్లో ప్రత్యేక సదుపాయాలు కోరిన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు
Ananthababu Jail News

కాకినాడ: రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు వ్యవహారంపై ఏబీఎన్‌లో వరుస కథనాలు ప్రసారం అయిన నేపథ్యంలో జైలు అధికారులు స్పందించారు. అనంతబాబు జైల్లో ప్రత్యేక సదుపాయాలు కోరిన విషయం వాస్తవమేనని అధికారులు అంగీకరించారు. అయితే జైలు నిబంధనలు, న్యాయస్థానం ఆదేశాల ప్రకారం మాత్రమే సదుపాయాలు కల్పిస్తామని ఆయనకు స్పష్టంగా తెలియజేసినట్లు అధికారులు వెల్లడించారు.


ఈ ఘటనపై రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ ఎస్. రాహుల్ అధికారికంగా ప్రకటన విడుదల చేశారు. జైలు నిబంధనలకు లోబడి ఖైదీలకు అవసరమైన సదుపాయాలు మాత్రమే అందిస్తామని ఆయన పేర్కొన్నారు.


Also Read:

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌‌ను పరామర్శించిన సీఎం చంద్రబాబు

దళితుల జోలికి వస్తే ఉరుకోం.. ఆకివీడు రామాలయం అంశంపై మందకృష్ణ మాదిగ..

For More Latest News

Updated Date - May 02 , 2026 | 07:56 PM