Share News

200 ప్లస్ సీట్లతో మనమే గెలుస్తాం.. మమతా బెనర్జీ ధీమా

ABN , Publish Date - May 02 , 2026 | 06:45 PM

పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయం సాధిస్తుందని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. ఈనెల 4న కౌంటింగ్ జరుగనుండటంతో కౌంటింగ్ ఏజెంట్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శనివారంనాడు ఆమె మాట్లాడారు.

200 ప్లస్ సీట్లతో మనమే గెలుస్తాం.. మమతా బెనర్జీ ధీమా
Mamata Banerjee

కోల్‌కతా: పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ (TMC) ఘన విజయం సాధిస్తుందని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) అన్నారు. ఈనెల 4న కౌంటింగ్ జరుగనుండటంతో కౌంటింగ్ ఏజెంట్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శనివారంనాడు ఆమె మాట్లాడారు. '200కు పైగా సీట్లతో మనం గెలవబోతున్నాం' అని ఈ సందర్భంగా ఆమె ధీమా వ్యక్తం చేశారు.


ఎగ్జిట్ పోల్స్ కేవలం స్టాక్ మార్గెట్‌ను మభ్యపెట్టేందుకే తప్ప మరొకటి కాదని, 2021, 2024లోనూ వాళ్లు ఇదే చేశారని, ఇప్పుడు కూడా జరిగిందదేనని మమతా బెనర్జీ వివరించారు. సీఏపీఎఫ్ దౌర్యనాలకు గురైన టీఎంసీ కార్యకర్తలకు రాబోయే రోజుల్లో తాము రివార్డులిస్తామని చెప్పారు.


protests.jpg

ఫాల్టాలో ఉద్రిక్తత.. టీఎంసీపై స్థానికుల ఫిర్యాదు

కాగా, రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 15 పోలింగ్ కేంద్రాల్లో శనివారంనాడు రీపోలింగ్ జరిగింది. పెద్ద ఎత్తున ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ క్రమంలో సౌత్ 24 పరగణాల జిల్లాలోని ఫాల్టాలో టీఎంసీ, బీజేపీ మద్దతుదారుల మధ్య ఘర్షణలు సైతం చోటుచేసుకున్నట్టు అధికారులు తెలిపారు. ఉదయం 11 గంటల వరకూ ఎలాంటి ఘటనలు జరగనప్పటికీ ఫాల్టాలో స్థానికులు ఆందోళన బాటపట్టడం ఉద్రిక్తతలకు దారితీసింది. టీఎంసీ గూండాలు తమను బెదిరిస్తున్నారని, కేంద్ర బలగాలైన సీఏపీఎఫ్‌ను మోహరించి తమకు రక్షణ కల్పించాలని స్థానికులు రోడ్లపైకి వద్ద ఆందోళనలకు దిగారు. అధికారులు వెంటనే స్పందించడంలో సీఆర్‌పీఎఫ్, ఆర్‌పీఎఫ్ దళాలను మోహరించారు. టీఎంసీ గూండాలు బెదిరిస్తున్నారని, వారు గెలిస్తే తమ ఇళ్లు తగులబెడతారని, రక్తపాతం తప్పదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.


మరోవైపు భారీ బలగాలు మోహరించినా టీఎంసీ గుండాల హింస, ఆందోళనకు ఆగడం లేదని బీజేపీ ఆరోపించింది. పశ్చిమబెంగాల్‌లోని ఒక స్ట్రాంగ్‌రూమ్‌ను అనుమతి లేకుండా కొందరు తెరిచారని, దీనిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేసింది. ఈనెల 4న పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.


ఇవి కూడా చదవండి..

200 సీట్లలో గెలుస్తాం.. విజయ్ టీవీకే ధీమా

అస్సాంలో హోటల్ పాలిటిక్స్ సంకేతాలు.. రంగంలోకి కాంగ్రెస్ పార్టీ ట్రబుల్ మేకర్ డీకే

Updated Date - May 02 , 2026 | 07:41 PM