Share News

పార్టీ మారిన ఎంపీపై రెండు ఎఫ్ఐఆర్‌లు... అరెస్టుకు అవకాశంతో అజ్ఞాతంలోకి

ABN , Publish Date - May 02 , 2026 | 04:54 PM

ఆమ్ ఆద్మీ పార్టీని వీడి ఇటీవల బీజేపీలో చేరిన రాజ్యసభ ఎంపీ సందీప్ పాఠక్‌పై పంజాబ్‌లో రెండు ఎఫ్ఐఆర్‌లు నమోదయ్యాయి. నాన్ బెయిలబుల్ వారెంట్ కింద ఈ కేసులు నమోదయ్యాయని తెలుస్తోంది.

పార్టీ మారిన ఎంపీపై రెండు ఎఫ్ఐఆర్‌లు... అరెస్టుకు అవకాశంతో అజ్ఞాతంలోకి
Sandeep pathak

న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీని వీడి ఇటీవల బీజేపీలో చేరిన రాజ్యసభ ఎంపీ సందీప్ పాఠక్ (Sandeep Pathak)పై పంజాబ్‌లో రెండు ఎఫ్ఐఆర్‌లు నమోదయ్యాయి. నాన్ బెయిలబుల్ వారెంట్ కింద ఈ కేసులు నమోదయ్యాయని తెలుస్తోంది. పంజాబ్ పోలీసులు ఆయన ఇంటి వద్ద భద్రతను కట్టుదిట్ట చేయడంతో ఆయనను ఏ క్షణంలోనే అరెస్టు చేసే అవకాశం ఉందని చెబుతున్నారు.


sandeep-pathak.jpg

రహస్య ప్రదేశంలోకి...

మరోవైపు, శనివారం ఉదయం సందీప్ పాఠక్ ఢిల్లీలోని తన అధికార నివాసం వెనుక వైపు నుంచి కారులో ఎక్కి డ్రైవ్ చేసుకుంటూ వెళ్లిన దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమంలో వైరల్ అవుతున్నాయి. ఆయన తన ఫోన్ స్విచ్‌ఆఫ్ చేశారని, రహస్యప్రదేశానికి వెళ్లారని అంటున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ లీగల్ సెల్ ఆయనను ఆదుకునేందుకు రంగంలోకి దిగినట్టు చెబుతున్నారు.


ఏప్రిల్ 24న రాఘవ్ చద్దాతో పాటు పార్టీని వీడిన ఏడుగురు ఎంపీలలో సందీప్ పాఠక్ ఉన్నారు. ఈ పరిణామం జరిగిన కొద్ది రోజులకే ఆయనపై కేసులు నమోదు కావడం సంచలనమవుతోంది. కాగా, తమ పార్టీని వీడిని ఏడుగురు ఎంపీలు బీజేపీలో విలీనం కావాడం చట్టవిరుద్ధమని, ఈ విషయాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు దృష్టికి ఈనెల 5న తీసుకు వెళ్తానని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ తెలిపారు. ఆప్ ఎంపీల ఉద్వాసనతో పంజాబ్ అసెంబ్లీలో స్వయంగా భగవంత్ మాన్ ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానం గెలిచింది. ఆమ్ ఆద్మీ పార్టీకి ఉన్న సపోర్ట్ చెక్కుచెదర లేదని, 2027లో ఇంతకంటే పెద్ద ప్రజాతీర్పును సాధిస్తామని సీఎం ధీమా వ్యక్తం చేసారు. పంజాబ్ అసెంబ్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి 94 మంది ఎమ్మెల్యేల బలం ఉండగా, కాంగ్రెస్‌కు 16, బీఎస్‌పీకి ఒక ఎమ్మెల్యే, సాద్‌కు ముగ్గురు, బీజేపీకి ఇద్దరు ఎమ్మెల్యేల బలం ఉంది. ఒక ఇండిపెండెంట్ కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు.


ఇవి కూడా చదవండి..

200 సీట్లలో గెలుస్తాం.. విజయ్ టీవీకే ధీమా

సుప్రీంకోర్టులో టీఎంసీకి ఎదురుదెబ్బ..

Updated Date - May 02 , 2026 | 04:59 PM