Share News

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌‌ను పరామర్శించిన సీఎం చంద్రబాబు

ABN , Publish Date - May 02 , 2026 | 06:34 PM

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో పరామర్శించారు. పవన్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌‌ను పరామర్శించిన సీఎం చంద్రబాబు
Chandrababu Visits Pawan Kalyan

ఇంటర్నెట్ డెస్క్: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌‌ను పరామర్శించారు. ఇటీవల పవన్ కల్యాణ్‌‌కు సర్జరీ జరగడంతో ప్రస్తుతం ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో శనివారం హైదరాబాద్‌లోని పవన్ కల్యాణ్‌‌ నివాసానికి సీఎం చంద్రబాబు వెళ్లి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. పవన్ కల్యాణ్‌‌ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన సీఎం చంద్రబాబు, తగినంత విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.


కాగా, పవన్ కల్యాణ్‌‌ ఇటీవల అస్వస్థతకు గురవడంతో హైదరాబాద్, జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుప‌త్రిలో చేరారు. ఆయనకు వైద్యులు పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఆయనకు ఫంక్షనల్ ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ(ముక్కు సంబంధిత శస్త్రచికిత్స) చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, పవన్ కల్యాణ్‌‌‌కు కొన్ని రోజుల పాటు పూర్తి విశ్రాంతి అవసరమని వైద్యులు స్పష్టం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి

అమరావతి అభివృద్ధిలో మరో ముందడుగు.. క్వాంటం వ్యాలీలో ట్విన్ టవర్లకు గ్రీన్ సిగ్నల్

స్వచ్ఛ రథాలకు నేచురల్ స్టార్ నాని సహాయం.. స్పందించిన డిప్యూటీ సీఎంవో..

Updated Date - May 02 , 2026 | 07:04 PM