స్వచ్ఛ రథాలకు నేచురల్ స్టార్ నాని సహాయం.. స్పందించిన డిప్యూటీ సీఎంవో..
ABN , Publish Date - May 02 , 2026 | 03:35 PM
ఆంధ్రప్రదేశ్‌లో 'స్వచ్ఛరథాలు' కార్యక్రమానికి ప్రముఖ సినీ హీరో, నేచురల్ స్టార్ నాని సహాయం చేయడంపై ఉప ముఖ్యమంత్రి కార్యాలయం స్పందించింది. నాని సహాయంపై ఎక్స్ వేదికగా పోస్టు పెట్టింది. అడిగిన వెంటనే సాయం చేయడంపై ప్రశంసలు కురిపించింది.
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో 'స్వచ్ఛరథాలు' కార్యక్రమానికి ప్రముఖ సినీ హీరో, నేచురల్ స్టార్ నాని సహాయం చేయడంపై ఉప ముఖ్యమంత్రి కార్యాలయం స్పందించింది. నాని సహాయంపై ఎక్స్ వేదికగా పోస్టు పెట్టింది. అడిగిన వెంటనే సాయం చేయడంపై ప్రశంసలు కురిపించింది.
డిప్యూటీ సీఎంవో ఎక్స్ పోస్టు..
'మన పారిశుద్ధ్యం.. మన ఆరోగ్యం.. మన బాధ్యత' అనే నినాదంతో పవన్ ఆలోచనల నుంచి స్వచ్ఛరథాలు పురుడుపోసుకున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల్లో ఈ స్వచ్ఛరథాలు విప్లవాత్మక మార్పులు తెస్తున్నాయి. చెత్త నుంచి సంపద సృష్టి అనే యజ్ఞంలో గ్రామీణ ప్రజల్ని భాగస్వాముల్ని చేస్తూ దూసుకుపోతున్నాయి. గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణను సులభతరం చేసేందుకు కూటమి ప్రభుత్వం తీసుకువచ్చిన స్వచ్ఛరథాల గురించి ప్రజల్లో మరింత అవగాహన కల్పించేందుకు అడిగిన వెంటనే తన వంతు సహాయ సహకారాలు అందించిన ప్రముఖ హీరో నానికి పవన్ కల్యాణ్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.
ఈ స్వచ్ఛరథాలు ఏప్రిల్ నెలలో రికార్డు స్థాయిలో సుమారు 19 లక్షల కేజీల పొడి చెత్త కొనుగోలు చేయడం ద్వారా రూ.3.32 కోట్ల విలువ గల నిత్యావసరాలను ప్రజలకి అందించాయని చెప్పేందుకు ఆనందిస్తున్నాం. గ్రామాల్లో పారిశుద్ధ్య ఉద్యమం పట్ల ప్రజల్లో పెంపొందుతున్న అవగాహనకు ఇది నిదర్శనం. భవిష్యత్ తరాలకు వ్యర్థాల నిర్వహణపై అవగాహన కల్పించేందుకు ప్రతి గురువారం పాఠశాలల వద్దకు ఈ స్వచ్ఛరథాలు వెళ్లి.. పొడి చెత్తకు బదులుగా పుస్తకాలు, స్టేషనరీ ఇచ్చే విధంగా చేసిన ఏర్పాటు సత్ఫలితాలను ఇస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడి స్వచ్ఛ భారత్, స్వచ్ఛాంధ్ర లక్ష్యాలను సాధించేందుకు ఈ స్వచ్ఛరథం కార్యక్రమాన్ని ప్రారంభించాం' అని డిప్యూటీ సీఎంవో ఎక్స్ వేదికగా పోస్టు పెట్టింది.
ఈ వార్తలు కూడా చదవండి
మంత్రి లోకేశ్ పనితీరు చాలా బాగుంది.. వెంకయ్యనాయుడు ప్రశంసలు
అమరావతి అభివృద్ధిలో మరో ముందడుగు.. క్వాంటం వ్యాలీలో ట్విన్ టవర్లకు గ్రీన్ సిగ్నల్