Share News

టీటీడీ చైర్మన్‌ కనబడడం లేదు

ABN , Publish Date - Mar 12 , 2026 | 12:58 PM

వైసీపీ నేతలు తెగబడ్డారు.తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం ముందే ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు కనిపించడం లేదంటూ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు.

 టీటీడీ చైర్మన్‌ కనబడడం లేదు

  • పరిపాలనా భవనం వద్ద ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన వైసీపీ

తిరుపతి: వైసీపీ నేతలు తెగబడ్డారు.తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం ముందే ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు కనిపించడం లేదంటూ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. బుధవారం మధ్యాహ్నం వైసీపీ(YCP) నేతలు అజయ్‌కుమార్‌, వంశీ, పసుపులేటి సురేష్‌, వాసుదేవ యాదవ్‌, అమర్నాథరెడ్డి, నల్లాని బాబు, అరుణ్‌కుమార్‌ తదితరులు టీటీడీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. అక్కడ బీఆర్‌ నాయుడు బొమ్మతో ఉన్న ఒక ఫ్లెక్సీని ప్రహరీ గోడ గ్రిల్లుకు తగిలించారు. ఇందులో ఛైర్మన్‌ కనపడడం లేదని వుంది. వైసీపీ నేతలు గోవిందా గోవిందా అంటూ నినాదాలు చేశారు. ఇంత వ్యవహారం జరుగుతున్నా టీటీడీ సిబ్బంది ఎవరూ గమనించలేదు.


zzz.jpgఆ తర్వాత తేరుకున్న టీటీడీ విజిలెన్స్‌ అఽధికారులు ఫ్లెక్సీని తొలగించారు.ఫ్లెక్సీ ఏర్పాటుపై తిరుపతి పోలీసులకు టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. వైసీపీ నాయకుడు కరుణాకరరెడ్డి ప్రోద్బలంమీదే ఆ పార్టీ నాయకులు ఫ్లెక్సీ ఏర్పాటు చేశారని, కాబట్టి ప్రధానంగా ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు. రాజకీయ కక్షసాధింపు ధోరణితో బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తిపై, అలాగే కోట్లాది మంది భక్తుల విశ్వాసానికి కేంద్రంగా ఉన్న ధార్మిక సంస్థపై అసత్య ప్రచారం చేయడం దారుణమన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

విద్యుత్ ఉత్పత్తిలో ఏపీ జెన్కో ఆల్‌టైమ్‌ రికార్డ్‌

మంత్రి లోకేశ్ ప్రజాదర్బార్.. ప్రజాసమస్యల పరిష్కారం కోసం చర్యలు

Read Latest Telangana News and National News

Updated Date - Mar 12 , 2026 | 12:58 PM