Share News

రూ.20 కోట్ల విలువైన 4,100 కిలోల గంజాయి దహనం

ABN , Publish Date - Apr 17 , 2026 | 03:27 PM

రేణిగుంటలో ప్రాంతంలో మూడేళ్లలో పట్టుబడ్డ రూ.20 కోట్ల విలువైన 4,100 కేజీల గంజాయిని అధికారులు దహనం చేశారు. జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు, కలెక్టర్ వెంకటేశ్వర్లు సమక్షంలో ఎలక్ట్రికల్ యంత్రం ద్వారా గంజాయి తగులబెట్టారు.

రూ.20 కోట్ల విలువైన 4,100 కిలోల గంజాయి దహనం
Tirupati Ganja destruction

తిరుపతి జిల్లా, ఏప్రిల్ 17: రేణిగుంటలో ప్రాంతంలో మూడేళ్లలో పట్టుబడ్డ రూ.20 కోట్ల విలువైన 4,100 కేజీల గంజాయిని అధికారులు దగ్ధం చేశారు. ఎర్రంరెడ్డి పాలెం డంపింగ్ యార్డులో జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు, కలెక్టర్ వెంకటేశ్వర్లు సమక్షంలో ఎలక్ట్రికల్ యంత్రం ద్వారా గంజాయి తగులబెట్టారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు మాట్లాడుతూ.. జిల్లా స్థాయిలో నిరంతరం తనిఖీలు నిర్వహిస్తూ, గంజాయి రవాణా, విక్రయాలపై ఉక్కుపాదం మోపుతున్నామని తెలిపారు. ఎవరైనా గంజాయి సరఫరా చేస్తే.. కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.


గంజాయి వల్ల యువత భవిష్యత్తు నాశనమవుతుందని, గంజాయి నిర్మూలనకు ప్రజల సహకారం అవసరమని ఎస్పీ కోరారు. గంజాయికి సంబంధించి ఎలాంటి సమాచారం ఉన్నా వెంటనే పోలీసులకు తెలియజేయాలని ప్రజలకు ఎస్పీ సుబ్బరాయుడు సూచించారు. సమాజంతో కలిసి పనిచేస్తేనే డ్రగ్స్ నిర్మూలన సాధ్యమని జిల్లా కలెక్టర్ వేంకటేశ్వరులు అన్నారు. యువత కోసం అవగాహన కార్యక్రమాల నిర్వహణపై ఎక్కువ దృష్టి పెట్టామని ఆయన వెల్లడించారు.


ఇవి కూడా చదవండి:

మహానాడు నిర్వహణపై లోకేశ్ కీలక చర్చలు.. స్థలాల పరిశీలనకు ఆదేశాలు

మావిగన్ పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు.. జగన్ అండ్ కోపై ఆనం ధ్వజం

ఏపీలో మోత మోగిస్తున్న ఎండలు.. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు

Updated Date - Apr 17 , 2026 | 04:10 PM