డీలిమిటేషన్ బిల్లుతో దక్షిణాది అతలాకుతలం
ABN , Publish Date - Apr 23 , 2026 | 10:47 AM
నియోజకవర్గాల పునర్విభజన బిల్లుతో దక్షిణాది రాష్ట్రాలు అతలాకుతలమవుతాయని సీపీఐ నేత నారాయణ వ్యాఖ్యానించారు.
సీపీఐ నేత నారాయణ
నగరి(చిత్తూరు): నియోజకవర్గాల పునర్విభజన బిల్లుతో దక్షిణాది రాష్ట్రాలు అతలాకుతలమవుతాయని సీపీఐ నేత నారాయణ వ్యాఖ్యానించారు. నగరి మండలం అయనంబాకంలోని తన స్వగృహంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ నియోజకవర్గాల పునర్విభజన బిల్లు వల్ల సీట్లు పెరుగుతాయేమో కానీ అభివృద్ధి కుంటుపడుతుందన్నారు. రాష్ట్రానికి ప్రాధాన్యత తగ్గిపోతుందన్న విషయం చంద్రబాబు లాంటి సీనియర్ గ్రహించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఒక్క ఆంధ్ర రాష్ట్రానికే గాక యావత్ దక్షిణాదికి ఇది ద్రోహం చేస్తుందన్నారు.
దక్షిణాదిన బీజేపీ గెలవదన్న విషయాన్ని గమనించిన ఆ పార్టీ పెద్దలు మహిళా రిజర్వేషన్ బిల్లు ముసుగులో డీలిమిటేషన్ బిల్లును తీసుకురావాలని కుట్ర పన్నారని విమర్శించారు. ఉత్తారాది రాష్ట్రాల్లో గెలిచి తమ ఇష్టానుసారం పార్లమెంటులో బిల్లులకు భేషరతుగా అమోదం పొందాలనుకుంటున్నారన్నారు. మోదీ, ఇతర బీజేపీ పెద్దలకు చంద్రబాబు, పవన్‌కల్యాణ్ వత్తాసు పలకడం పులి మీద స్వారీ లాంటిదని నారాయణ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
ప్రేమ వివాహం చేసుకున్న జంటపై తల్లిదండ్రుల దాడి
Read Latest Telangana News and National News