పరిశ్రమలకు నాణ్యమైన విద్యుత్
ABN , Publish Date - Apr 23 , 2026 | 10:19 AM
పరిశ్రమలకు నాణ్యమైన విద్యుత్ సరఫరా అందిస్తామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు.
మంత్రి గొట్టిపాటి
సత్యవేడు(తిరుపతి): పరిశ్రమలకు నాణ్యమైన విద్యుత్ సరఫరా అందిస్తామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. బుధవారం ఉదయం ఆయన శ్రీసిటీలో పరిశ్రమల ప్రతినిధులు, శ్రీసిటీ యాజమాన్యంతో విద్యుత్ సమస్యలపై చర్చించారు.ఈ సందర్భంగా శ్రీసిటీ ఎండీ రవీంద్ర సన్నారెడ్డి మాట్లాడుతూ కొల్లడం వద్ద ట్రాన్స్‌కో నిర్మిస్తున్న 132/33/కేవీ సబ్‌స్టేషన్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని విన్నవించారు. ఎల్‌జీ ఎలకా్ట్రనిక్స్, క్యారియర్, పీజీ ఎలెక్ర్టోప్లాస్ట్ తదితర ప్రముఖ పరిశ్రమలు ఉత్పత్తులకు సిద్ధమవుతున్న నేపథ్యంలో నిరంతర విద్యుత్ సరఫరా అత్యంత కీలకమన్నారు.
శ్రీసిటీ విస్తరణ దృష్ట్యా జపాన్ క్లస్టర్ సమీపంలో మరో సబ్‌స్టేషన్ ఏర్పాటు చేయడం వ్యూహాత్మక అవసరమన్నారు. శ్రీసిటీలోని ఐమాప్, థర్మాక్స్, ఇసుజు, కోబెల్కో, ఆక్సిలెంట్ ఫార్మా, బ్రేక్స్ ఇండియా, ఐసన్ తదితర పరిశ్రమల ప్రతినిధులు మాట్లాడుతూ విద్యుత్ సరఫరాలో అంతరాయాలు తగ్గించాలని కోరారు.శ్రీసిటీలో విద్యుత్ సమస్యల పరిష్కారానికి పరిశ్రమలతో ప్రతి నెలా సమావేశాలు నిర్వహిస్తామని ఎస్పీడీసీఎల్ సీఎండీ శివశంకర్ స్పష్టం చేశారు. అదనపు సబ్‌స్టేషన్ ఏర్పాటుకు ప్రాథమిక పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. గ్రీన్ టారిఫ్ ప్రోత్సాహకాల అంశాన్ని పాలసీ స్థాయిలో పరిశీలిస్తామని చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి:
ప్రేమ వివాహం చేసుకున్న జంటపై తల్లిదండ్రుల దాడి
Read Latest Telangana News and National News