దేవాన్ష్ జన్మదినం.. తిరుమలకు ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబం
ABN , Publish Date - Mar 20 , 2026 | 08:27 PM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ఐటీ, విద్యా శాఖల మంత్రి నారా లోకేశ్ కుటుంబసమేతంగా తిరుమలకు చేరుకున్నారు. తనయుడు దేవాన్ష్ పుట్టిన రోజును పురస్కరించుకుని మంత్రి లోకేశ్ కుటుంబసభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్నారు.
తిరుమల: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ఐటీ, విద్యా శాఖల మంత్రి నారా లోకేశ్ కుటుంబసమేతంగా తిరుమలకు చేరుకున్నారు. తనయుడు దేవాన్ష్ పుట్టిన రోజును పురస్కరించుకుని మంత్రి లోకేశ్ కుటుంబసభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్నారు. గాయత్రి నిలయం వద్ద వారికి టీటీడీ చైర్మన్, ఈవో, అదనపు ఈవో ఘనస్వాగతం పలికారు. శనివారం నాడు దేవాన్ష్ పుట్టిన రోజును పురస్కరించుకుని శ్రీవారిని దర్శించుకుని ఆశీస్సులు అందుకోనున్నారు.
కాగా, చంద్రబాబు సీఎం హోదాలో ఉన్నప్పటికీ తిరుమలలో మహాద్వార దర్శనం చేసుకునే అవకాశమున్నా ఆయన మాత్రం సాధారణ భక్తుల్లా క్యూ కాంప్లెక్స్ మార్గాన్నే ఎంచుకుని శ్రీవారి దర్శనం చేసుకోవడం విశేషం. సీఎంగా ఉన్నవారికి తిరుమలలో ప్రోటోకాల్ ప్రకారం మహాద్వార దర్శనం సౌకర్యం ఉంటుంది. అయితే, దేవుని ముందు అందరూ సమానమే అనే భావనతో చంద్రబాబు ఎప్పుడూ క్యూ కాంప్లెక్స్ ద్వారానే దర్శనం చేసుకుంటారు. తొలిసారి సీఎం అయినప్పటి నుంచీ ఆయన ఇదే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా పట్టువస్త్రాలు సమర్పించే సందర్భం మినహా, మిగతా అన్ని సందర్భాల్లో కుటుంబసభ్యులతో కలిసి సాధారణ మార్గాన్నే అనుసరిస్తున్నారు.
సాధారణ భక్తుల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే ఆయన క్యూ కాంప్లెక్స్ ద్వారా దర్శనానికి వెళ్తారని తెలుస్తోంది. అక్కడ భక్తులకు అందుతున్న సదుపాయాలు.. ప్రసాదం పంపిణీ, తాగునీరు, పారిశుద్ధ్యం వంటి అంశాలను స్వయంగా పరిశీలిస్తారు. ఎక్కడైనా లోపాలు ఉంటే వెంటనే సరిదిద్దాలని అధికారులకు సూచనలు ఇస్తారు.
ఇక తిరుమలలో అన్నదానం సేవకు కూడా చంద్రబాబు కుటుంబం నుంచి సహాయం కొనసాగుతోంది. ఎన్టీఆర్ హయాంలో ఏర్పాటు చేసిన అన్నదానం ట్రస్ట్ ద్వారా భక్తులకు నిత్యం భోజనం అందుతోంది. దేవాన్ష్ పేరుతో ప్రతి ఏడాది విరాళం అందిస్తూ చంద్రబాబు కుటుంబం సేవా కార్యక్రమాల్లో భాగస్వామ్యమవుతోంది. ఇప్పటివరకు దేవాన్ష్ పేరుతో అనేక సార్లు విరాళాలు అందజేశారు. ఈ విధంగా సాధారణ భక్తుల్లా దర్శనం చేసుకోవడం ద్వారా సమానత్వానికి ప్రాధాన్యం ఇస్తూ, భక్తుల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు సీఎం చంద్రబాబు.
ఈ వార్తలు కూడా చదవండి..
పూర్తిస్థాయిలో పంట నష్టాన్ని లెక్కించాలి.. అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
యువత ఆకాంక్షలను నెరవేరుస్తున్నాం: పవన్ కల్యాణ్
నా ఛాంప్‌తో కలిసి ఉగాది వేడుకలు.. మంత్రి నారా లోకేశ్ ఆసక్తికర పోస్టు
Read Latest AP News