Share News

అమరావతిలో ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి.. భూమిపూజ చేసిన సీఎం చంద్రబాబు

ABN , Publish Date - Sep 23 , 2026 | 06:51 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిలో ఎల్‌వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి భవన నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భూమిపూజ చేశారు.

అమరావతిలో ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి.. భూమిపూజ చేసిన సీఎం చంద్రబాబు
chandrababu lays foundation stone for lv prasad eye hospital

అమరావతి, సెప్టెంబర్ 23: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఎల్‌వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి సేవలు అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్ర రాజధాని అమరావతిలోని తుళ్లూరు మండంలోని అబ్బరాజుపాలెంలో ఆసుపత్రి భవన నిర్మాణానికి ముఖ్యమంత్రి భూమిపూజ చేశారు. ఈ మేరకు శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.


12 ఎకరాల్లో నిర్మించనున్న ఈ ఆసుపత్రిలో పరిశోధనా కేంద్రంతో పాటు.. గ్లోబల్ స్థాయిలో క్యాంపస్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. ఏడాదికి 3 లక్షల మందికి వైద్యం అందించగలిగేలా ఆసుపత్రి నిర్మాణాన్ని చేపట్టినట్లు ఆయన వెల్లడించారు.


ప్రపంచం మెచ్చేలా రాజధాని నిర్మాణం: చంద్రబాబు

అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ప్రపంచం మెచ్చే నగరంగా అమరావతిని నిర్మిస్తాం.. గ్రీన్ ఎనర్జీ సిటీగా అమరావతిని తీర్చిదిద్దుతాం.. రాజధానిని హెల్త్‌కేర్ హబ్‌గా మార్చుతాం. స్టార్టప్‌ల ఏర్పాటు కోసం 21 కంపెనీలు ముందుకొచ్చాయి. ఏఐ, డేటా సెంటర్‌, క్వాంటమ్‌, డీప్‌ టెక్నాలజీలు రాష్ట్రానికి రాబోతున్నాయి. స్పోర్ట్స్‌ సిటీ, ఎయిర్‌పోర్టును ఏర్పాటు చేయనున్నాం. రాజధానిలో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను అభివృద్ధి చేస్తూ.. రూ.60 వేల కోట్లతో రోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. కర్నూలులో ఇప్పటికే అన్నీ రకాల డ్రోన్లు తయారవుతున్నాయి. అనేక విద్యాసంస్థలు రాష్ట్రంలో అందుబాటులోకి వచ్చాయి. రాష్ట్ర యువత ఈ సదవకాశాలను వినియోగించుకుని సాంకేతికతను అందిపుచ్చుకోవాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.


ఇవి కూడా చదవండి..

సాయికృష్ణ లాకప్ డెత్ కేసు.. సుప్రీంకోర్టులో కీలక పరిణామం

బీజేపీలో కీలక మార్పులు.. ఏపీ, తెలంగాణకు కొత్త ఇన్‌చార్జిలు

Read Latest AP News And Telugu News

Updated Date - Sep 23 , 2026 | 09:49 PM