Share News

బీజేపీలో కీలక మార్పులు.. ఏపీ, తెలంగాణకు కొత్త ఇన్‌చార్జిలు

ABN , Publish Date - Sep 23 , 2026 | 03:34 PM

బీజేపీ సంస్థాగత వ్యవహారాల్లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు పార్టీ అధిష్ఠానం కొత్త ఇన్‌చార్జిలు, కో-ఇన్‌చార్జిలను నియమించింది.

బీజేపీలో కీలక మార్పులు.. ఏపీ, తెలంగాణకు కొత్త ఇన్‌చార్జిలు
BJP Andhra Pradesh

ఇంటర్నెట్ డెస్క్: బీజేపీ సంస్థాగత వ్యవహారాల్లో కీలక మార్పులు చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు కొత్త ఇన్‌చార్జిలు, కో-ఇన్‌చార్జిలను నియమించింది. ఏపీ బీజేపీ ఇన్‌చార్జిగా డాక్టర్ అరవింద్ భదౌరియాను, కో-ఇన్‌చార్జిగా శ్రీమతి వనతి శ్రీనివాసన్‌ను పార్టీ అధిష్ఠానం నియమించింది. తెలంగాణ బీజేపీ ఇన్‌చార్జిగా సునీల్ బన్సల్‌ను, కో-ఇన్‌చార్జిలుగా అభయ్ పాటిల్, శ్రీమతి రేఖా శర్మలను నియమించింది. రాష్ట్రాల్లో పార్టీ సంస్థాగత కార్యకలాపాలను సమన్వయం చేయడం.. రాష్ట్ర నాయకత్వంతో కలిసి పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడం ఇన్‌చార్జిల ప్రధాన బాధ్యతల్లో భాగంగా ఉంటుంది. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో 28 జిల్లాలకు బీజేపీ జిల్లా ఇన్‌చార్జిలను నియమించడంతో పాటు.. రాష్ట్ర కార్యవర్గాన్ని కూడా పునర్వ్యవస్థీకరించిన నేపథ్యంలో తాజా జాతీయ స్థాయి నియామకాలు వచ్చాయి.


ఇదే సమయంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు బీజేపీ నాయకులకు ఇతర రాష్ట్రాల సంస్థాగత బాధ్యతలను పార్టీ అప్పగించింది. బీజేపీ ఏపీ నేత, మాజీ కేంద్ర మంత్రి దగ్గుబాటి పురందేశ్వరిని బీజేపీ ఒడిశా ఇన్‌చార్జిగా నియమించారు. తెలంగాణకు చెందిన డీకే అరుణను తమిళనాడు బీజేపీ కో-ఇన్‌చార్జిగా, డాక్టర్ కసమ్ వెంకటేశ్వర్లును కర్ణాటక బీజేపీ కో-ఇన్‌చార్జిగా నియమించారు. దీంతో తెలుగు రాష్ట్రాల నాయకులకు ఇతర రాష్ట్రాల్లో పార్టీ వ్యవహారాలను పర్యవేక్షించే బాధ్యతలు కూడా దక్కాయి. ఈ నియామకాలన్నీ తక్షణమే అమల్లోకి వస్తాయని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ ప్రకటించినట్లు సమాచారం. ఇక కొత్త జాతీయ బృందంలో తరుణ్ చుగ్‌కు కేంద్ర కార్యాలయ ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించినట్లు తాజా నివేదికలు పేర్కొంటున్నాయి.


ఇవి కూడా చదవండి...

అక్టోబర్‌లో స్థానిక ఎన్నికలు.. కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యం: మంత్రి లోకేశ్

సాయికృష్ణ కేసు.. హైకోర్టు విచారణపై స్టే విధించిన సుప్రీంకోర్టు

Read Latest TG News And Telugu News

Updated Date - Sep 23 , 2026 | 04:17 PM