భారత అండర్ 19 క్రికెట్ జట్టుకు సీఎం చంద్రబాబు అభినందనలు
ABN , Publish Date - Nov 14 , 2026 | 09:47 PM
పురుషుల అండర్-19 ఆసియా కప్ 2026 ట్రోఫీ గెలుచుకున్న టీమిండియాపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశంసలు కురిపించారు. ఎక్స్ వేదికగా జట్టుకు బాబు అభినందనలు తెలిపారు.
ఇంటర్నెట్ డెస్క్: పురుషుల అండర్-19 ఆసియా కప్ 2026 ట్రోఫీ గెలిచిన టీమిండియాపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశంసల జల్లు కురిపించారు. ఎక్స్ వేదికగా జట్టుకు బాబు అభినందనలు తెలిపారు. పాకిస్థాన్‌పై చివరి బంతికి సంచలన విజయం సాధించడం చరిత్రాత్మక, అద్భుతమైన క్షణమని ఆయన పేర్కొన్నారు. ఆసియా కప్ అండర్-19 ఫైనల్‌లో పాకిస్థాన్‌పై చివరి బంతికి టీమిండియా సంచలన విజయం సాధించిందని కొనియాడారు. పాకిస్థాన్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో భారత జట్టు అసాధారణ సంయమనం, సమష్టి కృషిని ప్రదర్శించిందని ప్రశంసించారు. చాంపియన్స్‌గా నిలిచిన భారత అండర్-19 జట్టు సభ్యులందరికీ ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ వార్తలనూ చదవండి:
జగన్ మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది: మంత్రి లోకేశ్